عَنِ الأَسْوَدِ بنِ يَزِيدَ قَالَ:
سَأَلْتُ عَائِشَةَ مَا كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَصْنَعُ فِي بَيْتِهِ؟ قَالَتْ: كَانَ يَكُونُ فِي مِهْنَةِ أَهْلِهِ -تَعْنِي خِدْمَةَ أَهْلِهِ-، فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ خَرَجَ إِلَى الصَّلاَةِ.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 676]
المزيــد ...
కుడి వైపున నిద్రపోవడం వల్ల త్వరగా మేల్కొనవచ్చు, ఎందుకంటే గుండె కుడి వైపు నిద్రపోయిన స్థితిలో గుండే తక్కువగా స్థిరంగ ఉంటుంది మరియు గుండె ఎడమ వైపున ఉన్నందు వలన కుడి వైపునకు తిరిగి పడుకోవడం అనేది గుండెకు మరింత విశ్రాంతినిస్తుంది. ఒక వ్యక్తి ఎడమ వైపునకు తిరిగి నిద్రపోతే, శరీరపు బరువు దానిపై పడి ఒత్తిడి కలుగజేస్తుంది, అది హృదయానికి హాని కలిగిస్తుంది.
“నేను ఆయిషా రదియల్లాహు అన్హాను అడిగాను, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారు?” అని. ఆమె ఇలా అన్నారు, “ఇంటిలో ఆయన తన కుటుంబానికి సేవ చేసేవారు అంటే తన ఇంటి పనులలో సహాయం చేసేవారు, మరియు నమాజు సమయం వచ్చినప్పుడు నమాజు కోసం బయటకు వెళ్లేవారు.”
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ నమోదు చేసినారు:] - [సహీహ్ అల్ బుఖారీ - 676]
విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయషా రదియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఎలా ఉండేవారు అని, తన ప్రవర్తన గురించి, తాను చేసే పనుల గురించి అడిగారు. ఆమె ఇలా జవాబిచ్చినారు: "ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరుల వలే ఒక మానవమాత్రుడు మాత్రమే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులు తమ ఇళ్లలో చేసే విధంగానే పని చేసేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన పనులను తానే చేసుకునేవారు మరియు తన కుటుంబానికి కూడా సేవ చేసేవారు (అంటే ఇంటి పనులలో సహాయం చేసేవారు); ఆయన తమ గొర్రెలకు పాలు పితుకుతారు, తన బట్టలు చిరిగిపోతే కుట్టుకుంటారు, తన చెప్పులు తెగిపోతే వాటిని కుట్టి సరిచేసుకుంటారు మరియు ఇంటిలో లోహపు బాల్చీ (బక్కెట్టు) పాడైపోతే దానికి అతుకులు వేసి బాగుచేస్తారు. అయితే నమాజు సమయం ఆసన్నమైనపుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆలస్యం చేయకుండా నమాజు కొరకు బయటకు వెళ్ళేవారు.