عَنْ أَبِي هُرَيْرَةَ رضي لله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يَفْرَكْ مُؤْمِنٌ مُؤْمِنَةً، إِنْ كَرِهَ مِنْهَا خُلُقًا رَضِيَ مِنْهَا آخَرَ» أَوْ قَالَ: «غَيْرَهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1469]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఒక పురుష విశ్వాసి, ఒక స్త్రీ విశ్వాసి అసహ్యించుకొన రాదు. ఆమె లక్షణాలలో ఒకదానిని అతడు ఇష్టపడకపోతే, మరొక లక్షణంతో అతడు సంతోషిస్తాడు” లేక “వేరే (ఇంకేదైనా) లక్షణంతో” అన్నారు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1469]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక భర్త తన భార్యను ద్వేషించరాదని, ఆమెను అసహ్యించుకొన రాదని నిషేధిస్తున్నారు. అలా చేయడం ఆమెపై హింసకు, ఆమెను వదిలివేయడానికి మరియు ఆమె నుండి ముఖం తిప్పేసుకోవడానికి దారి తీస్తుంది. మనిషి సహజంగా అసంపూర్ణుడు, ఒకవేళ అతను ఆమెలో ఒక చెడు లక్షణాన్ని ఇష్టపడకపోతే, అతను ఆమెలో మరొక మంచి లక్షణాన్ని కనుగొంటాడు; తన ప్రవృత్తికి సరిపోయే ఆ మంచి లక్షణంతో అతడు సంతృప్తి చెందుతాడు. తనకు నచ్చని ఆ చెడు లక్షణం పట్ల అతడు సహనం వహిస్తాడు. ఆ సహనం ఆమెను ద్వేషించడం నుండి, ఆమెను అసహ్యించుకోవడం నుండి ఆపుతుంది; ఆమెను వదిలి వేసేందుకు లేదా ఆమె నుండి దూరమయ్యేందుకు దారి తీసే పరిస్థితి రాకుండా చేస్తుంది.