عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيَّ رَضِيَ اللَّهُ عَنْهُ -وَكَانَ غَزَا مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ثِنْتَيْ عَشْرَةَ غَزْوَةً- قَالَ: سَمِعْتُ أَرْبَعًا مِنَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَعْجَبْنَنِي، قَالَ:
«لاَ تُسَافِرِ المَرْأَةُ مَسِيرَةَ يَوْمَيْنِ إِلَّا وَمَعَهَا زَوْجُهَا أَوْ ذُو مَحْرَمٍ، وَلاَ صَوْمَ فِي يَوْمَيْنِ: الفِطْرِ وَالأَضْحَى، وَلاَ صَلاَةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَطْلُعَ الشَّمْسُ، وَلاَ بَعْدَ العَصْرِ حَتَّى تَغْرُبَ، وَلاَ تُشَدُّ الرِّحَالُ إِلَّا إِلَى ثَلاَثَةِ مَسَاجِدَ: مَسْجِدِ الحَرَامِ، وَمَسْجِدِ الأَقْصَى، وَمَسْجِدِي هَذَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1995]
المزيــد ...
అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు పన్నెండు యుద్ధాలలో పాల్గొన్నారు. ఆయన ఇలా ఉల్లేఖిస్తునారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను నాలుగు విషయాలు విన్నాను. అవి నాకు బాగా నచ్చాయి:
“ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు; రెండు దినములు ఉపవాసాములు పాటించరాదు ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు, మరియు ఈద్ అల్ అజ్’హా దినము నాడు; ఫజ్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) ఉదయించే వరకు ఏ నమాజు లేదు, అస్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) అస్తమించే వరకు ఏ నమాజు లేదు; మూడు మస్జిదులకు తప్ప తీర్థయాత్ర చేయరాదు – మస్జిదుల్ హరాం, మస్జిదుల్ అఖ్సా, మరియు ఈ మస్జిద్ (అంటే మదీనాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ - మస్జిదె’నబవీ).”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1995]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాలను నిషేధించినారు:
మొదటిది: ఒక స్త్రీ తన భర్త లేదా ఆమె ‘మహరమ్ పురుషులలో’ ఒకరు లేకుండా రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించకుండా నిషేధించడం; ‘మహరమ్ పురుషులు’ అంటే ఆమెను వివాహం చేసుకోవడం శాశ్వతంగా నిషేధించబడినవారు, ఉదాహరణకు: ఆమె బంధువులలో - ఆమె కొడుకు, తండ్రి, మామ, సోదరుడు, సొదరుని కొడుకు, సోదరి కొడుకు, తల్లి సోదరులు, లేదా తండ్రి సోదరులు వంటి బంధువులు మొదలైన వారు.
రెండవది: ఒక ముస్లిం ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు మరియు ఈద్ అల్ అద్’హా దినము నాడు ఉపవాసము పాటించుటను నిషేధించినారు; అతడు మొక్కుబడిగా మొక్కుకుని ఉన్న ఉపవాసమును పాటించ దలచినా, లేక స్వచ్ఛంద (నఫిల్) ఉపవాసము పాటించ దలచినా, లేక పరిహారంగా పాటించవలసి ఉన్న ఉపవాసమును పాటించదలచినా – ఈ రెండు దినములలో పాటించరాదు.
మూడవది: అస్ర్ నమాజు తరువాత సూర్యాస్తమయం వరకు ఏదైనా నఫిల్ నమాజు పాటించుట, మరియు ఫజ్ర్ నమాజు తరువాత సూర్యోదయం వరకు ఏదైనా నఫిల్ నమాజు పాటించుట – ఈ రెండూ నిషేధించబడినవి.
నాలుగవది: మూడు మస్జిదులకు తప్ప – ఏదైనా ఒక నిర్దుష్ఠ ప్రదేశానికి, ఆ ప్రదేశము మహత్తు గల ప్రదేశము అని, లేదా అది మహా ఘనత గల ప్రదేశము అని, లేదా ఆ ప్రదేశాన్ని దర్శించడం వల్ల పుణ్యాలు రెట్టింపు అవుతాయని – ఇలాంటి విశ్వాసాలతో ప్రయాణించడం నిషేధించబడినది. కనుక, ఏ ఇతర మస్జిదులకు ప్రత్యేకంగా ప్రయాణం చేసి వెళ్ళరాదు, ఎందుకంటే ఈ మూడు మస్జిదులలో మాత్రమే పుణ్యఫలం రెట్టింపు అవుతుంది – అవి ఒకటి మస్జిదుల్ హరాం, రెండు మస్జిదున్’నబవీ మరియు మూడు మస్జిదుల్ అఖ్సా.