عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رضي الله عنه قَالَ: خَرَجَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي أَضْحَى أَوْ فِطْرٍ إِلَى المُصَلَّى، فَمَرَّ عَلَى النِّسَاءِ، فَقَالَ:
«يَا مَعْشَرَ النِّسَاءِ، تَصَدَّقْنَ، فَإِنِّي أُرِيتُكُنَّ أَكْثَرَ أَهْلِ النَّارِ» فَقُلْنَ: وَبِمَ يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «تُكْثِرْنَ اللَّعْنَ، وَتَكْفُرْنَ العَشِيرَ، مَا رَأَيْتُ مِنْ نَاقِصَاتِ عَقْلٍ وَدِينٍ أَذْهَبَ لِلُبِّ الرَّجُلِ الحَازِمِ مِنْ إِحْدَاكُنَّ»، قُلْنَ: وَمَا نُقْصَانُ دِينِنَا وَعَقْلِنَا يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: «أَلَيْسَ شَهَادَةُ المَرْأَةِ مِثْلَ نِصْفِ شَهَادَةِ الرَّجُلِ» قُلْنَ: بَلَى، قَالَ: «فَذَلِكِ مِنْ نُقْصَانِ عَقْلِهَا، أَلَيْسَ إِذَا حَاضَتْ لَمْ تُصَلِّ وَلَمْ تَصُمْ» قُلْنَ: بَلَى، قَالَ: «فَذَلِكِ مِنْ نُقْصَانِ دِينِهَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 304]
المزيــد ...
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఈద్ అల్ అద్’హా దినమునాడో లేదా ఈద్ అల్ ఫిత్ర్ దినమునాడో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (ఈద్) నమాజు ఆచరించుటకు నమాజు ఆచరించు ప్రదేశానికి బయలుదేరినారు. దారిలో వారు ఒక స్త్రీల గుంపును దాటుకుంటూ వెళ్ళినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా పలికినారు:
“ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు”. దానికి వారు “మా ధర్మములో మరియు వివేకములో ఉన్న లోపం ఏమిటి?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగినారు: “(షరియత్’లో) ఒక స్త్రీ సాక్ష్యము, పురుషుని సగం సాక్ష్యానికి సమానం కాదా? (అంటే ఇద్దరు స్త్రీల సాక్ష్యము ఒక పురుషుని సాక్ష్యమునకు సమానము కాదా?”) దానికి వారు “అవును” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇది వివేకములో ఆమె లోపము. అలాగే స్త్రీ బహిష్ఠు స్థితిలో ఉన్నపుడు ఆమె నమాజు ఆచరించదు, ఉపవాసము పాటించదు, అవును కదా?” అని ప్రశ్నించారు. దానికి వారు “అవును” అని సమాధానం ఇచ్చినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఇది ధర్మములో ఆమె కొరత” అన్నారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 304]
ఒకసారి ఈద్ దినమునాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ నమాజు ఆచరించుటకు, నమాజు ఆచరించే ప్రదేశానికి బయలుదేరినారు. ఆ సందర్భముగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మహిళలకు ప్రత్యేక ప్రసంగం ఇస్తానని వాగ్దానం చేశారు మరియు ఆ రోజున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: “ఓ స్త్రీలారా! ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉండండి, ఎక్కువగా క్షమాభిక్ష కొరకు అల్లాహ్’ను అర్థిస్తూ ఉండండి; పాపముల పరిహారం కొరకు ఉన్న సాధనాలలో అవి గొప్పసాధనాలు; ఎందుకంటే ఇస్రా ప్రయాణపు రాత్రి నరకవాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను.”
అప్పుడు వారిలో తెలివైన, మంచి గ్రహణశక్తిగల, మరియు గౌరవప్రదమైన ఒక మహిళ: “ ఓ రసూలుల్లాహ్! నరకనివాసులలో ఎక్కువ మంది మేమే ఎందుకుంటాము?” అని ప్రశ్నించినది.
అప్పుడు వారిలో తెలివైన, మంచి గ్రహణశక్తిగల, మరియు గౌరవప్రదమైన ఒక మహిళ: “ ఓ రసూలుల్లాహ్! నరకనివాసులలో ఎక్కువ మంది మేమే ఎందుకుంటాము?” అని ప్రశ్నించింది. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని ఇలా వర్ణించారు: తెలివితేటలు, హేతుబద్ధత, జ్ఞానం మరియు తన వ్యవహారాలపై నియంత్రణ ఉన్న వ్యక్తిని కూడా దారి తప్పించడంలో మీ కంటే ఎక్కువ తెలివితేటలు మరియు నైతికత లోపించిన వారిని నేను చూడలేదు.
ఆమె ఇలా అన్నది: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మా వివేకములో మరియు ధర్మములో కొరత ఏమిటి?”
అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: వివేకములో కొరత విషయానికొస్తే, (షరియతులో) ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుడి సాక్ష్యానికి సమానం; వివేకములో కొరత అంటే ఇదే. ధర్మములో కొరత అంటే వారి మంచి పనులు చేసే అవకాశాలు తగ్గడం, ఎందుకంటే ఒక స్త్రీ రుతుస్రావం కారణంగా ఆ కాలంలో రాత్రింబవళ్ళు నమాజు ఆచరించకుండా గడుపుతుంది; అలాగే రుతుస్రావం కారణంగా రమదాన్ మాసములో తక్కువ రోజులు ఉపవాసం ఉంటుంది; ధర్మములో కొరత అంటే ఇదే. అయితే, వారు దానికి నిందార్హులు గానీ లేదా జవాబుదారులు గానీ కాదు; ఎందుకంటే ఇది వారి సహజ స్వభావంలో భాగం, పురుషులు సంపద పట్ల సహజమైన ప్రేమ, వారి విషయాలలో తొందరపాటు, అజ్ఞానం మరియు ఇతర లక్షణాలతో సృష్టించబడినట్లే (స్త్రీలు కూడా సహజంగానే ఆ విధంగా సృష్టించబడినారు). అయితే, వారితో మోహంలో పడకుండా ఉండటానికి ఇక్కడ ఇది హెచ్చరికగా ప్రస్తావించబడింది.