عَنْ عُقْبَةَ بْنَ عَامِرٍ الْجُهَنِيَّ رضي الله عنه قَالَ:
ثَلَاثُ سَاعَاتٍ كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَنْهَانَا أَنْ نُصَلِّيَ فِيهِنَّ، أَوْ أَنْ نَقْبُرَ فِيهِنَّ مَوْتَانَا: حِينَ تَطْلُعُ الشَّمْسُ بَازِغَةً حَتَّى تَرْتَفِعَ، وَحِينَ يَقُومُ قَائِمُ الظَّهِيرَةِ حَتَّى تَمِيلَ الشَّمْسُ، وَحِينَ تَضَيَّفُ الشَّمْسُ لِلْغُرُوبِ حَتَّى تَغْرُبَ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 831]
المزيــد ...
ఊఖ్బహ్ బిన్ ఆమిర్ అల్ జుహనీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
“మూడు సమయాలలో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను నమాజు ఆచరించడం నుండి, మరియు మాలో చనిపోయిన వారిని ఖననం చేయడం నుండి నిషేధించేవారు. వాటిలో (ఒకటి) సూర్యుడు ఉదయించడం మొదలైనప్పటి నుండి పూర్తిగా ఉదయించేంత వరకు, (రెండు) (మిట్టమధ్యాహ్నం) సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు, నడినెత్తి నుంచి కొద్దిగా వాలనంత వరకు; మరియు (మూడు) సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనప్పటి నుండి అస్తమించడం పూర్తికానంతవరకు – (ఈ మూడు) సమయాలు ఉన్నాయి.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 831]
దినములో మూడు సమయాలలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ఆచరించడాన్ని, చనిపోయిన వారిని ఖననం చేయడాన్ని నిషేధించినారు. మొదటి సమయం: సూర్యుడు ఉదయిస్తూ ఉన్నపుడు, అంటే సూర్యుడు పూర్తిగా ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించనంత వరకు (నమాజు ఆచరించరాదు). ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించడానికి దాదాపు పావు గంట సమయం పడుతుంది. రెండవది: మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద ఉన్నపుడు. అపుడు ఒక వస్తువు యొక్క నీడ తూర్పు వైపునకు గానీ లేక పడమర వైపునకు గానీ ఉన్నట్లుగా కనిపించదు, సూర్యుడు నడినెత్తి మీద నుంచి కొద్దిగా వాలనంత వరకు. సూర్యుడు నడినెత్తి మీదనుండి వాలితే అపుడు నీడ పడమర వైపు నుండి కనబడుతుంది. అపుడు జుహ్ర్ నమాజు సమయం మొదలవుతుంది. సూర్యుడు నడి నెత్తి మీద నుండి వాలడాని కొద్ది సమయమే పడుతుంది, దాదాపు ఐదు నిమిశాలు. మూడవది: సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనప్పటి నుండి అస్తమించడం పూర్తి కానంత వరకు.