+ -

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رضي الله عنهما أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ قَالَ حِينَ يَسْمَعُ النِّدَاءَ: اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلاَةِ القَائِمَةِ، آتِ مُحَمَّدًا الوَسِيلَةَ وَالفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ، حَلَّتْ لَهُ شَفَاعَتِي يَوْمَ القِيَامَةِ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 614]
المزيــد ...

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది."

[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 614]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే ముఅజ్జిన్ అదాన్ పలుకుట పూర్తి అయిన తరువాత ఈ క్రింద తెలుపబడిన విధంగా పలుకుతాడో:
(అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతి) - ఓ అల్లాహ్! ఈ పిలుపునకు ప్రభువా! అంటే ఇవి అల్లాహ్‌ను ఆరాధించడానికి మరియు నమాజు చేయడానికి ప్రజలను పిలవడానికి ఉపయోగించే అదాన్ పదాలు. వాటి ద్వారానే నమాజు కొరకు పిలుపు ఇవ్వబడుతుంది. (అత్’త్తామ్మతి) – అత్యంత పరిపూర్ణమైన (పిలుపు); అత్యంత పరిపూర్ణమైనది అంటే, తౌహీద్ (ఏకదైవత్వం) యొక్క పిలుపు మరియు దైవిక సందేశం; (వస్సలాతిల్ ఖాఇమహ్) మరియు స్థాపించబడబోయే ఈ నమాజు, అంటే, ఆ ఆరాధన నిరంతరం ఆచరించబడునటువంటిది, మరియు ప్రస్తుతం ప్రారంభించబడబోతున్నటువంటిది; (ఆతి) ఓ అల్లాహ్! ప్రసాదించు; (ముహమ్మదన్ అల్ వసీలత) అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానాన్ని ప్రసాదించు; (అల్ ఫజీలత) అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఔన్నత్యాన్ని ప్రసాదించు, అంటే తీర్పు దినమున సృష్టిరాశులలో వాటన్నింటి స్థాయిల కంటే అత్యంత ఉన్నతమైన స్థాయిని ప్రసాదించు; (వబ్’అథ్’హు) ఆయనకు ప్రసాదించు, (మఖామన్ మహ్’మూదన్) శ్రేష్ఠమైన, ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నతమైన స్థానము, అక్కడ నిలబడిన వాడు ప్రశంసించబడతాడు, అంటే అది పునరుత్థాన దినమున సిఫారసు చేసే అన్నింటి కంటే గొప్ప అవకాశం, (అల్లదీ వఅద్’తహు) నీవు దేనినైతే ఆయనకు ప్రసాదించుటకు వాగ్దానం చేసినావో; దివ్య ఖుర్’ఆన్’లో, ఓ అల్లాహ్ నీవు పలికిన మాటల ప్రకారం { عَسَىٰٓ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًۭا مَّحْمُودًۭا } (…నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామమ్‌ మ'హ్‌మూద్‌) నొసంగవచ్చు!) – ఆ ప్రశంసనీయమైన స్థానమును ఆయనకు ప్రసాదించు.”
ఈ దుఆను ఎవరైతే పఠిస్తారో వారు పునరుత్థాన దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సిఫార్సుకు అర్హులు అవుతారు.

من فوائد الحديث

  1. ముఅజ్జిన్ అదాన్ పలుకుతున్నపుడు వింటున్నవారు అదాన్ పదాలను పునరుచ్ఛరించడం పూర్తి అయిన తరువాత ఈ దుఆ పలుకులు పలుకుట షరియత్’లో ఉన్న విషయమే. అయితే అదాన్ వినని వ్యక్తికి ఈ దుఆను ఉచ్చరించవలసిన అవసరం లేదు.
  2. ఈ హదీథు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క ఘనతను తెలియజేస్తున్నది – ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వర్గంలో అత్యున్నత స్థానం, ఉన్నత స్థాయి, ప్రశంసనీయ స్థానం మరియు ప్రజల మధ్య తీర్పు చెప్పడంలో గొప్ప మధ్యవర్తిత్వం లభించడం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఘనతను సూచిస్తున్నాయి.
  3. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లంకు తీర్పుదినము నాడు తన ఉమ్మత్ కొరకు సిఫార్సు చేయు ఘనత లభిస్తుంది అనీ "తీర్పు దినాన అతడికి నా సిఫార్సు ఇవ్వబడుతుంది" అనీ ఈ హదీథులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట ద్వారా రుజువు అవుతున్నది.
  4. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు – వారి ఉమ్మత్’లో పెద్ద పాపాలు చేసిన వారి కొరకు చేయబడుతుంది, వారు నరకములోనికి ప్రవేశించకుండా ఉండుటకు; లేదా అప్పటికే నరకంలోనికి ప్రవేశించిన వారిని అందులో నుండి బయటకు తీయుటకు; లేదా తన ఉమ్మత్’లో తీర్పుదినమున అల్లాహ్ చేత ప్రశ్నించబడకుండానే స్వర్గములోనికి ప్రవేశించే వారి కొరకు; లేక అప్పటికే స్వర్గములోని ప్రవేశించిన వారికి మరింత ఉన్నత స్థానములు ప్రసాదించబడుటకు అయి ఉంటుంది.
  5. అత్-తైబీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: అదాన్ యొక్క ప్రారంభం నుండి ముఅజ్జిన్ "ముహమ్మదర్రసూలుల్లాహ్” (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు)" అని పలకడం వరకు ఇది పరిపూర్ణ పిలుపు (అద్ద’వతిత్తామ్మహ్); మరియు “హయ్య అలాహ్..” అనే పదలతో కూడిన వాక్యాలు (హయ్య అలస్సలాహ్ (సలాహ్ వైపునకు రండి); హయ్య అలల్’ఫలాహ్ (సాఫల్యం వైపునకు రండి) అనే వాక్యాలు), దివ్య ఖుర్’ఆన్ లో అల్లాహ్ “యుఖీమూనస్సలాత” (సలాహ్’ను స్థాపించండి) అని పలికిన మాటల వెలుగులో అప్పుడు స్థాపించబడబోతున్న నమాజును సూచిస్తున్నాయి; అయితే ఇక్కడ “సలాహ్” అంటే “దుఆ” అని కూడా అర్థము ఉన్నది, మరియు “అల్-ఖాఇమహ్” నిరంతరతను సూచిస్తున్నది. దీని ఆధారంగా, "వస్సలాతిల్ ఖాఇమహ్” (స్థాపించబడబోతున్న సలాహ్) అని ముఅజ్జిన్ పలకడం ఇవ్వబడుతున్న పరిపూర్ణ పిలుపు యొక్క స్పష్టీకరణగా చూడవచ్చును. కనుక ఆ సమయంలో పిలవబడే సాధారణ సలాహ్ అనే అర్థం ఇక్కడ మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.
  6. అల్-ముహల్లబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈహదీథు నమాజు సమయాల్లో ఈ దుఆను పలకడాన్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే అది దుఆలకు సమాధానం లభించే సమయం.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية النيبالية المجرية Урумӣ الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా