عن عبد الله بن عمرو رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال:
«الدُّنْيَا مَتَاعٌ، وَخَيْرُ مَتَاعِ الدُّنْيَا الْمَرْأَةُ الصَّالِحَةُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1467]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము మాత్రమే. వాటిలో ఉత్తమమైనది ధర్మపరాయణురాలైన భార్య”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1467]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఇలా తెలియజేశారు: ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్నదంతా ఒక (పరిమిత కాలపు) సంతోషము, ఆనందము మాత్రమే. తరువాత అది అంతమైపోతుంది. మరియు దాని ఉత్తమమైన ఆనందము ధార్మికురాలైన భార్య. అతడు ఆమెను చూస్తే అతనికి సంతోషం కలుగుతుంది, అతడు ఆమెను ఏదైనా ఆదేశిస్తే, ఆమె దానిని వెంటనే పూర్తి చేస్తుంది. ఒకవేళ అతడు ఇంటికి దూరంగా ఉంటే ఆమె అతడిని పరిరక్షిస్తుంది – (తన శీలాన్ని కాపాడుకుంటూ) తనను తాను రక్షించుకొనుట ద్వారా, మరియు అతడి సంపదను కాపాడుట ద్వారా.