عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صلَّى الله عليه وسلم قال:
«ما مِنْ أحَدٍ يُسلِّمُ علي إلا ردَّ اللهُ عليَّ رُوحي حتى أردَّ عليه السَّلامَ».
[إسناده حسن] - [رواه أبو داود وأحمد] - [سنن أبي داود: 2041]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”
[దాని ఆధారాలు ప్రామాణికమైనవి] - - [سنن أبي داود - 2041]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: తనపై ఎవరు సలాం పంపినా – వారు దగ్గరగా ఉన్నా, లేక దూరంగా ఉన్నా- వారికి తిరిగి సలాం పంపుటకుగానూ, తన ఆత్మ తిరిగి పంపబడుతుంది. “బర్జఖ్” (అంటే మరణం మరియు పునరుథ్థాన దినము మధ్య కాలం); మరియు సమాధిలో జీవితం అనేది అగోచర విషయం (కనిపించనది). వాటి వాస్తవికత సర్వోన్నతుడు, అన్నింటిపై అధికారం కలవాడు అయిన అల్లాహ్’కు తప్ప మరెవరికీ తెలియదు.