عن جُندب بن عبد الله القَسْرِِي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ صَلَّى صَلَاةَ الصُّبْحِ فَهُوَ فِي ذِمَّةِ اللهِ، فَلَا يَطْلُبَنَّكُمُ اللهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ، فَإِنَّهُ مَنْ يَطْلُبْهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ يُدْرِكْهُ، ثُمَّ يَكُبَّهُ عَلَى وَجْهِهِ فِي نَارِ جَهَنَّمَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 657]
المزيــد ...
జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖస్రియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే ఫజ్ర్ సలాహ్’ను (ఫజ్ర్ నమాజును) ఆచరిస్తారో, వారు అల్లాహ్ రక్షణలో ఉన్నారు. కనుక మీలో ఎవరూ కూడా అల్లాహ్ రక్షణలో ఉన్న వానికి ఏ విధంగానూ హాని తలపెట్టరాదు. ఎవరైతే హాని తలపెడతాడో, అతడిని అల్లాహ్ యొక్క ఆగ్రహం చుట్టుకుంటుంది. అతడు ముఖం మీద పడవేసి నరకాగ్ని లోనికి విసిరి వేయబడతాడు”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 657]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఎవరైతే ఫజ్ర్ సలాహ్ ఆచరిస్తారో వారు అల్లాహ్ యొక్క సంరక్షణలో, ఆయన పహరాలో మరియు ఆయన సహాయములో ఉంటారు - అని తెలియజేస్తున్నారు.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – ఫజ్ర్ సలాహ్ ను వదిలి వేయడం ద్వారా లేదా భక్తులపై దాడి చేయడం లేదా వారిపై దౌర్జన్యం చేయడం ద్వారా, అల్లాహ్ యొక్క ఈ వాగ్దానాన్ని భంగ పరచడం లేదా వ్యతిరేకించడం మొదలైనవి చేయరాదని హెచ్చరించినారు. ఎందుకంటే ఎవరైతే అలా చేస్తాడో, అతడు అల్లాహ్ యొక్క వాగ్దానాన్ని భంగ పరిచాడన్నమాట. అటువంటి వాడిని ‘నా హక్కును నీవు ఎందుకు నిర్లక్ష్యం చేసావు’ అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ఆ విధంగా ఎవరినైతే అడుగుతాడో, అల్లాహ్ అతడిని ముఖంపై పడవేసి నరకాగ్నిలోనికి విసరివేస్తాడు.