عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلَاثَةِ أَيَّامٍ، وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 857]
المزيــد ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే శుక్రవారమునాడు పరిపూర్ణంగా ఉదూ చేసుకుని, శుక్రవారపు నమాజుకు వెళ్ళి, ఇమాం యొక్క ప్రసంగాన్ని శ్రద్ధగా వింటాడో, మరియు (మస్జిదులో) మౌనంగా ఉంటాడో, ఆ శుక్రవారానికీ మరియు రాబోయే శుక్రవారానికీ మధ్య అతని వలన జరిగే చిన్న చిన్న పాపాలన్నీ క్షమించివేయబడతాయి; అంతేకాకుండా దానికి మరో మూడు దినములు అదనంగా కలుపబడతాయి. కాని (ప్రసంగం మధ్యలో) అతడు ఒక చిన్న గులకరాయిని తాకినా, అతడు వ్యర్థమైన పనిలో పాల్గొన్న వానిగా లెక్కించబడతాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 857]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఉదూ యొక్క మూల స్తంభాలను (అర్కాన్ అల్ ఉదూ) పూర్తిగా ఆచరిస్తూ, దాని యొక్క సున్నత్ ఆచరణలను (సునన్ అల్ ఉదూ) మరియు విధివిధానాలను పూర్తిగా పాటిస్తూ, సంపూర్ణంగా ఉదూ చేసి శుక్రవారం నమాజునకు హాజరవుతాడో, మరియు ఇమాం యొక్క ‘ఖుత్బాహ్’ను శ్రద్ధగా వింటాడో, మరియు (మస్జిదులో) పనికిరాని వ్యర్థ సంభాషణ నుండి దూరంగా ఉంటాడో – అల్లాహ్ అతని పది రోజుల చిన్నచిన్న పాపాలను క్షమిస్తాడు; శుక్రవారం నమాజు నుండి మరో శుక్రవారం వరకు, మరియు అదనంగా మూడు రోజులు; ఎందుకంటే ఒక మంచి పనికి పది రెట్ల ప్రతిఫలం ప్రసాదించబడుతుంది గనుక. తరువాత ఇమాం ‘ఖుత్బాహ్’లో (ప్రసంగం లో) చెప్పే విషయాల పట్ల హృదయాన్ని లగ్నం చేయకుండా ఉండడాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు; అలాగే ప్రసంగం జరుగుతూ ఉండగా మస్జిదులో నేలపై గులకరాళ్ళను తాకడం, వాటిని ఏరడం మొదలైన వృధా కాలక్షేపం వంటి పనులకు పాల్బడడం పట్ల కూడా హెచ్చరించినారు. ఎందుకంటే ఎవరైతే అలా చేస్తారో (ఖుత్బాహ్ జరుగుతుండగా) వారు వ్యర్థమైన విషయాలలో పడిపోయిన వారుగా పరిగణించబడతారు, ఎవరైతే వ్యర్థమైన విషయాలలో పడిపోతారో వారికి శుక్రవారం యొక్క సంపూర్ణ పుణ్యఫలం లభించదు.