عَنْ سَهْلِ بْنِ مُعَاذِ بْنِ أَنَسٍ عَنْ أَبِيهِ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ أَكَلَ طَعَامًا فَقَالَ: الحَمْدُ لِلَّهِ الَّذِي أَطْعَمَنِي هَذَا وَرَزَقَنِيهِ مِنْ غَيْرِ حَوْلٍ مِنِّي وَلاَ قُوَّةٍ، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ».
[حسن] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 3458]
المزيــد ...
సహల్ బిన్ ము’ఆజ్ ఇబ్న్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వహ్” (ప్రశంసలన్నీ ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి, ఎవరైతే నాలో ఎటువంటి శక్తి, బలమూ లేకపోయినా నాకు ఈ ఆహారాన్ని సమకూర్చినాడో) – అని పలుకుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.”
[ప్రామాణికమైనది] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي - 3458]
ఆహారం భుజించిన తరువాత ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడాలని (ఆయన ఘనత ముందు మన అశక్తతను గుర్తించాలని) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితబోధ చేస్తున్నారు. ‘అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ఆయన సహాయంతో తప్ప, ఆహారం తెచ్చుకొనుటకు గానీ, దానిని భుజించుటకు గానీ శక్తిలేని వాడను’ అని. ఆహారం భుజించిన తరువాత ఎవరైతే ఆ విధంగా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడుతారో, అతని పూర్వపు చిన్న చిన్న పాపాలన్నీ క్షమించబడుటకు అర్హుడవుతాడు అనే శుభవార్తను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందజేస్తున్నారు.