+ -

عن أَبِي أُمَامَةَ إِياسِ بنِ ثَعْلَبَةَ الحَارِثِيِّ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنِ اقْتَطَعَ حَقَّ امْرِئٍ مُسْلِمٍ بِيَمِينِهِ، فَقَدْ أَوْجَبَ اللهُ لَهُ النَّارَ، وَحَرَّمَ عَلَيْهِ الْجَنَّةَ» فَقَالَ لَهُ رَجُلٌ: وَإِنْ كَانَ شَيْئًا يَسِيرًا يَا رَسُولَ اللهِ؟ قَالَ: «وَإِنْ قَضِيبًا مِنْ أَرَاكٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 137]
المزيــد ...

అబూ ఉమామా ఇయాస్ బిన్ థఅలబహ్ అల్-హారిసీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ ﷺ ఇలా పలికినారు:
"ఎవరైనా తప్పుడు ప్రమాణం చేసి (అల్లాహ్ పేరుతో అసత్య ప్రమాణం చేసి) ఒక ముస్లింకు చెందిన హక్కును (ఆస్తిని, వస్తువును, హక్కును) కాజేస్తే, అల్లాహ్ అతడి కొరకు స్వర్గాన్ని నిషేధిస్తాడు, నరకాన్ని తప్పనిసరి చేస్తాడు." అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! అది చిన్నది అయినాా (తక్కువ విలువది అయినా)?" ప్రవక్త ﷺ ఇలా జవాబు ఇచ్చారు: "అది ఒక చిన్న మిస్వాక్ పంటి పుల్ల అయినా సరే."

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 137]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: అల్లాహ్ పేరుతో తప్పుడు ప్రమాణం చేయడం (అబద్ధమని తెలిసీ ప్రమాణం చేయడం), ముఖ్యంగా ఒక ముస్లింకు చెందిన హక్కును (ఆస్తిని, హక్కును) అన్యాయంగా కాజేయడం కోసం చేస్తే, దానికి శిక్ష పడే: నరకానికి అర్హుడు కావడం, స్వర్గాన్ని కోల్పోవడం. ఇది పెద్ద పాపాల్లో (కబీరా గునాహ్) ఒకటి. అప్పుడు ఒక వ్యక్తి అడిగాడు: "ఓ రసూలుల్లాహ్! ఆ (అబద్ధపు) ప్రమాణం చేసిన వస్తువు (హక్కు) చిన్నదైనా (తక్కువ విలువదైనా) ఇదే శిక్షా?" దానికి ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా చెప్పినారు: "అది (తప్పుడు ప్రమాణం చేసి కాజేసిన హక్కు) ఒక చిన్న అరాక్ చెట్టు నుండి తీసిన సివాక్ పుల్ల (మిస్వాక్) అయినా సరే."

من فوائد الحديث

  1. ఇతరుల హక్కులను హరించడాన్ని గట్టిగా నివారించాలి,
  2. అవి ఎంత చిన్నవైనా సరే, వాటిని యజమానులకు వాపసు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం: న్యాయస్థానం (జడ్జి) తప్పుగా తీర్పు ఇచ్చినా, అది నిజంగా మీది కాని వస్తువును మీకు హక్కుగా చేయదు. అంటే, న్యాయస్థానం మీకు అనుకూలంగా తీర్పు చెప్పినా, అది నిజంగా మీది కాకపోతే, దాన్ని తీసుకోవడం హలాల్ కాదు.
  3. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ముస్లింల హక్కులను అన్యాయంగా హరించడం చాలా తీవ్రమైన నిషేధం (పెద్ద పాపం) అని ఇస్లాం ధర్మం స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఇది ఎంత చిన్న హక్కు అయినా, ఎంత పెద్దదైనా - ఏమీ తేడా లేదు. దీనికి కారణం: ప్రవక్త ముహమ్మద్ ﷺ స్పష్టంగా చెప్పారు: "ఒక అరాక్ చెట్టు చిన్న (పంటి) పుల్ల (సివాక్) అయినా సరే."
  4. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పినారు: ఈ తీవ్రమైన శిక్ష (నరకానికి అర్హత, స్వర్గం నిషేధం) తప్పక వర్తించేది ఎప్పుడంటే: ఎవరు ఇతర ముస్లింకు హక్కును అన్యాయంగా కాజేసి, తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడక ముందే మరణిస్తే. కానీ... ఎవరైనా పశ్చాత్తాప పడి (తన తప్పును గుర్తించి, నిజంగా పశ్చాత్తాపపడితే), కాజేసిన హక్కును యజమానికి తిరిగి ఇచ్చి, లేదా యజమానిని క్షమాపణ కోరితే, ఇకపై అలాంటి తప్పు చేయనని నిర్ణయించకుంటే, అల్లాహ్ అతని పాపాన్ని క్షమిస్తాడు, అతనిపై శిక్ష వర్తించదు.
  5. అల్-ఖాది ఇలా అన్నారు: ఈ హదీథులో "ముస్లిం" అనే పదాన్ని ప్రత్యేకంగా ఉపయోగించడం, ఎందుకంటే ముస్లింలే ఎక్కువగా ఇస్లామీయ ఆచరణల్లో పాల్గొంటారు, మరియు షరీఅతులో ఎక్కువగా పరస్పర లావాదేవీలు ముస్లింల మధ్యనే జరుగుతాయి. అంటే: ఇది ఇతర మతస్థులకు ఈ న్యాయం వర్తించదు అని అర్థం కాదు. ఇస్లాం ధర్మం ప్రకారం, ముస్లింకు మాత్రమే కాదు, ఇతర మతస్థుల హక్కులను కూడా అన్యాయంగా తీసుకోవడం నిషిద్ధమే. అంటే, ఇక్కడి నిబంధన, శిక్ష — అందరి విషయంలో సమానంగా వర్తిస్తుంది.
  6. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పినారు: అబద్ధం (కదిబ్) అంటే: ఒక విషయం గురించి నిజానికి విరుద్ధంగా చెప్పడం. ఇది ఉద్దేశపూర్వకంగా (చూసి చెప్పినా), లేదా తెలియక చెప్పినా (అజ్ఞానంగా చెప్పినా) — రెండింటికీ వర్తిస్తుంది. ఇది గతంలో జరిగిన విషయమైనా, భవిష్యత్తులో జరగబోయే విషయమైనా — రెండింటికీ వర్తిస్తుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الموري Малагашӣ الأوكرانية الجورجية المقدونية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా