عن أبي هُريرة رضي الله عنه مرفوعًا: «إذا قلتَ لصاحبك: أَنْصِتْ يوم الجمعة والإمام يَخْطُبُ، فقد لَغَوْتَ».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం‘నువ్వు నీ సహచరునికి ఇమామ్ జుమ సందర్భాన ప్రసంగిస్తుండగా నిశబ్దంగా ఉండు’అని చెప్పినా' ఒక వ్యర్థ లఘుకార్యం నీవు చేసినట్లు అవుతుంది.'
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

{శుక్రవారం}జుమా యొక్క గొప్ప ఆచరణాల్లో ప్రధానమైనవి:మింబర్ పై ఇవ్వబడే రెండు ఉపన్యాసాలు వినడం,దాని ప్రయోజనాల్లో ముఖ్యమైనవి ప్రజలకు హితభోద చేయడం,మార్గ నిర్దేశనం చేయడం,వినేవారి నైతికతల్లో ముఖ్యమైనది : ఖతీబ్ చెప్పే విషయాలను మౌనంగా వినడం మరియు అతను చెప్పే హితబోధను గ్రహించడం,కాబట్టి మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ చిన్న మాట కూడా మాట్లాడకూడదని హెచ్చరించారు,- ఉదా తోటివ్యక్తిని మాట్లాడకు అని వారిస్తూ’ నిశబ్దంగా ఉండండి అని చెప్పడం,’ఇమామ్ ఖుత్బా ఇస్తున్నప్పుడు సంభాషించినవాడు ఒక వ్యర్థ లఘూ కార్యం చేశాడు,అతను జుమా ఘనత నుండి తొలగిపోతాడు,ఎందుకంటే స్వయంగా తాను ఖుత్బా వినకపోవడమే కాక ఇతరులను కూడా వినకుండా విఘాతానికి గురిచేశాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. జుమాలొ ఖతీబ్ ప్రసంగిస్తుండగా మౌనంగా ఉండటం వాజిబ్ విధి,ధార్మిక ఉలమాలు పండితులు వాజిబ్ విధి అనే విషయంగా ఏకీభావం వ్యక్తం చేశారు
  2. ఖుత్బా వినేటప్పుడు సంబాషించడం హరాము,నియమానికి విరుద్దము,ఒక వేళ చెడు నుండి వారించడం,సలాం కు ప్రతిసలాం చేయడం,తుమ్మిన వాడికి జవాబు చెప్పడం ఇవన్నీ కూడా మరొకరితో సంభాషించినట్లుగా పరిగణించబడతాయి.
  3. ఇమామ్ తో మాట్లాడుతున్న వాడి కొరకు లేదా ఇమామ్ మాట్లాడుతున్న వ్యక్తి కొరకు ఇందులో మినహాయింపు ఉంది.
  4. కొంత మంది ధార్మిక పండితులు మరియు ఉలమాలు తెలిపారు ; ఒక వేళ ఇమామ్ ప్రసంగం దూరంగా ఉండటం వల్ల వినలేని వారు మౌనంగా ఉండటం విధి కాదు,వారు ఆ సమయాన్ని జిక్ర్ మరియు ఖుర్ఆన్ పారాయణం కొరకు ఉపయోగించవచ్చు,మరెవరైతే చెవిటితనం తో వినలేకపోతారో వారు ఖుర్ఆన్ పారాయణం బిగ్గరగా ఇతరులకు భంగం కలిగించకుండ తనకు మాత్రమే వినిపించే విధంగా చేసుకోవాలి.
  5. ఖుత్బా సమయం లో మాట్లాడేవాడు జుమా ప్రాముఖ్యతలో నుండి రెండు విషయాలను శిక్షగా కోల్పోతాడు
  6. రెండు ఖుత్బాల మధ్యలో మాట్లాడుటకు అనుమతివ్వబడింది.
  7. ఇమామ్ ఖుత్బా ప్రసంగిస్తున్నప్పుడు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ పేరు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దరూద్ మరియు సలాం ను మెల్లిగా పఠించాలి,హదీసుల వెలుగులో ఇలా చేయడం దొరుకుతుంది,ఇదే విధంగా దుఆ చేస్తున్నప్పుడు ఆమీన్ కూడా పలకవచ్చు
ఇంకా