+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَسْرِعُوا بِالْجِنَازَةِ، فَإِنْ تَكُ صَالِحَةً فَخَيْرٌ تُقَدِّمُونَهَا، وَإِنْ يَكُ سِوَى ذَلِكَ، فَشَرٌّ تَضَعُونَهُ عَنْ رِقَابِكُمْ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1315]
المزيــد ...

అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
"మృతదేహాన్ని (అంత్యక్రియల కొరకు) త్వరగా తీసుకెళ్లండి ఎందుకంటే అది ధర్మపరునిదైతే, మీరు దానిని శుభానికి పంపుతున్నారు; మరి అది దానికి భిన్నమైనది అయితే, మీరు మీ మెడలో నుండి ఒక చెడును, కీడును తొలగించుకుంటున్నారు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1315]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంత్యక్రియల సన్నాహాలు, ప్రార్థనలు (జనాజా నమాజు) మరియు ఖననం చేయడం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎందుకంటే మృతదేహం ధర్మబధ్ధునిదైతే, సమాధిలో అత్యంత సంతోషకరమైన జీవితానికి మీరు అతడిని చేర్చి ఆశీర్వదించినవారవుతారు. అది (ఆ మృతదేహం) అందుకు భిన్నన్మైనది అయితే మీరు మీ మెడనుండి ఒక చెడును, కీడును తొలగించుకున్న వారవుతారు.

من فوائد الحديث

  1. ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: అంత్యక్రియల సన్నాహాలను వేగవంతం చేయడం మంచిది, కానీ మృతదేహానికి హాని, నష్టం కలిగేలా, లేదా అంత్యక్రియలలో పాల్గొన్నవారికి ఇబ్బంది కలిగించేలా వేగవంతం చేయకూడదు.
  2. మృతదేహాన్ని ఖననం చేయడంలో తొందరపడం అనేది ‘వ్యక్తి మరణం అకస్మాత్తుగా సంభవించినది కాదు’ అనే షరతుపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అది ‘మూర్ఛ’ లేదా ‘కోమా’ స్థితి కూడా కావచ్చును. అటువంటి స్థితిలో మరణం ఖచ్చితంగా నిర్ధారణ అయ్యేటంత వరకు ఖనన ప్రక్రియను ఆలస్యం చేయవచ్చును. మృతదేహము కుళ్ళిపోతుందేమో అనే ఆందోళన, చింత లేనట్లైతే, ఖనం చేయడంలో సముచితమైన ఆలస్యం చేయవచ్చును, ఉదాహరణకు: మృతుని జనాజా నమాజులో ఎక్కువమంది భక్తులు పాల్గొనేలా ఆలస్యం చేయడం, బంధువుల రాక కొరకు ఎదురు చూడడం, మొదలైనవి.
  3. ఈ హదీథులో అంత్యక్రియలను త్వరితంగా చేయాలనే ప్రోత్సాహం, మరణించిన వ్యక్తి ధార్మికుడై ఉంటే అతని ప్రయోజనం కోసం లేదా అతను ధార్మికుడు కాకపోయి ఉంటే, అంత్యక్రియను అనుసరించే వారి ప్రయోజనం కోసం.
  4. ఇమాం అన్-నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “దీని నుండి మనం తీసుకోదగిన సారం ఏమిటంటే పనిపాటు లేకుండా, ఖాళీఈగా సొమరిగా ఉండేవారి, మరియు అధర్మపరులై ఉన్న వారి సహవాసానికి దూరంగా ఉండాలి”.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి