عَنْ جَرِيرِِ بْنِ عَبْدِ اللَّهِ رضي الله عنه قَالَ:
بَايَعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى شَهَادَةِ أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامِ الصَّلاَةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَالسَّمْعِ وَالطَّاعَةِ، وَالنُّصْحِ لِكُلِّ مُسْلِمٍ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2157]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసాను – “లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదర్’రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు); నమాజు స్థాపిస్తాను; జకాతు చెల్లిస్తాను; (పాలకుని) మాట వింటాను మరియు అనుసరిస్తాను; తోటి ప్రతి ముస్లింకు నిజాయితీగా సలహా ఇస్తాను - అని”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2157]
ఈ హదీసులో జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు – ఖచ్చితంగా కట్టుబడి ఉండడానికి సంకల్పించుకుని 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసినాను' అని తెలియజేస్తున్నారు – తౌహీదునకు (కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు అనే విశ్వాసానికి – ఏకదైవారాధనకు) కట్టుబడి ఉంటానని; ప్రతిరోజూ రాత్రింబవళ్ళలలో విధిగా ఆచరించవలసిన నమాజులను, వాటి షరతులను, వాటి మూలస్థంభముల వంటి విషయాలను, వాటికి చెందిన ఫర్జ్ (తప్పనిసరి) మరియు సున్నత్ విషయాలను పాటిస్తూ ఆచరించుటకు కట్టుబడి ఉంటానని; అల్లాహ్ చే ఆదేశించబడిన - ఒక ఆర్ధిక పరమైన ఆరాధన అయిన – జకాతును చెల్లించుటకు కట్టుబడి ఉంటానని (ఇది సంపన్నులనుండి సేకరించబడి, అర్హులైన పేదలకు మరియు అక్కర గలవారికి పంచిపెట్ట బడుతుంది); పాలకునికి విధేయత చూపుతానని, మరియు ప్రతి ముస్లిం పట్ల నిజాయితీగా ఉంటానని, నా మాటల ద్వారా మరియు నా చేతల ద్వారా అతనికి మంచి జరిగేలా చూస్తాను అని, అతడి నుండి చెడును, కీడును దూరం చేస్తాను అని ప్రమాణం చేసాను.