ఉప కూర్పులు

హదీసుల జాబితా

“నిశ్చయంగా కపటులపై అత్యంత భారమైన నమాజులు ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. వాటిలో ఏమి (శుభము దాగి) ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, వారు (తమ కాళ్ళపై నడవలేక) ప్రాకుతూ రావలసి వస్తే, అలా ప్రాకుతూ అయినా వస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ఫజ్ర్ సలాహ్’ను (ఫజ్ర్ నమాజును) ఆచరిస్తారో, వారు అల్లాహ్ రక్షణలో ఉన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసాను – “లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదర్’రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు); నమాజు స్థాపిస్తాను; జకాతు చెల్లిస్తాను; (పాలకుని) మాట వింటాను మరియు అనుసరిస్తాను; తోటి ప్రతి ముస్లింకు నిజాయితీగా సలహా ఇస్తాను - అని”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు అతని నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ‘బర్దైన్’ నమాజులను’ ఆచరిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒకవేళ మీలో ఎవరి ఇంటి ముంగిట అయినా ఒక నది పారుతూ ఉండి, అందులో అతడు రోజుకు ఐదు సార్లు స్నానం చేయడం ఎవరైనా చూసారా? అలా చేసిన తరువాత, అతడి ఒంటిపై ఏమైనా మలినం మిగిలి ఉంటుందా, ఏమంటారు మీరు?
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ బిలాల్! ‘అఖామత్’ పలుకు (నమాజు ప్రారంభించుటకు ముందు ‘నమాజు ప్రారంభమవుతున్నది’ అని తెలియజేస్తూ పలుకబడే పదాలు), తద్వారా మా అందరికీ సాంత్వన కలుగజేయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ