عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهَرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ فِيهِ كُلَّ يَوْمٍ خَمْسًا، مَا تَقُولُ ذَلِكَ يُبْقِي مِنْ دَرَنِهِ؟» قَالُوا: لَا يُبْقِي مِنْ دَرَنِهِ شَيْئًا، قَالَ: «فَذَلِكَ مِثْلُ الصَّلَوَاتِ الخَمْسِ، يَمْحُو اللَّهُ بِهِ الخَطَايَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 528]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నానని ఉల్లేఖించారు:
“ఒకవేళ మీలో ఎవరి ఇంటి ముంగిట అయినా ఒక నది పారుతూ ఉండి, అందులో అతడు రోజుకు ఐదు సార్లు స్నానం చేయడం ఎవరైనా చూసారా? అలా చేసిన తరువాత, అతడి ఒంటిపై ఏమైనా మలినం మిగిలి ఉంటుందా, ఏమంటారు మీరు?” దానికి వారు ఇలా అన్నారు: “ఎలాంటి మలినమూ కూడా మిగిలి ఉండదు”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మరి ఐదు సలాహ్’ల (నమాజుల) ఉదాహరణ కూడా ఇటువంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 528]
రాత్రింబవళ్ళ కాలములో ఐదు పూటలా విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), చిన్న పాపాలు మరియు తప్పులు తుడిచి వేస్తాయని మరియు వాటికి పరిహారంగా ఉపకరిస్తాయని పలుకుతూ, ఇంటి ముంగిట పారుతున్న నదిలో రోజుకు ఐదు సార్లు స్నానం చేయడంతో పోల్చినారు – ఏ విధంగానైతే ఇంటి వాకిట పారుతున్న నదిలో రోజుకు ఐదు సార్లు స్నానం చేసే వాని శరీరంపై నుండి అశుద్ధత, మలినాలు దూరమైపోతాయో అదే విధంగా ఐదు నమాజులు కూడా అతడి నుండి అతని చిన్న పాపాలను, తప్పులను దూరం చేస్తాయి.