عن أَبِي مُوسَى الأَشْعَرِيِّ رضي الله عنه: أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«مَنْ صَلَّى الْبَرْدَيْنِ دَخَلَ الْجَنَّةَ»
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 574]
المزيــد ...
అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూల్లల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఎవరైతే ‘బర్దైన్’ నమాజులను’ ఆచరిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 574]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘బర్దైన్’ నమాజులను ఆచరించుటకు ఆశపడాలని, ఆసక్తి కలిగి ఉండాలని హితబోధ చేస్తున్నారు. ‘బర్దైన్’ నమాజులు అంటే ‘ఫజ్ర్’ మరియు ‘అస్ర్’ నమాజులు. ఎవరైతే ఆ నమాజులను వాటి హక్కును చెల్లిస్తూ, వాటి నిర్ధారిత సమయాలలో, మస్జిదులో జమా’అత్ తో పాటు ఆచరించడం మొదలైన విషయాలను పాటిస్తూ ఆచరిస్తాడో, అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను ఇస్తున్నారు – ఆ నమాజులు అతడు స్వర్గములో ప్రవేశించడానికి ఒక కారణము కాగలవు.