عَنْ جَابِرٍ رَضيَ اللهُ عنهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ قَالَ: سُبْحَانَ اللهِ العَظِيمِ وَبِحَمْدِهِ، غُرِسَتْ لَهُ نَخْلَةٌ فِي الجَنَّةِ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 3464]
المزيــد ...
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరు ‘సుబహానల్లాహిల్-అజీమ్ వ బిహమ్'దిహి’ పరమ పవిత్రుడైన అల్లాహ్‌కు మహోన్నత మహిమ గలవాడు మరియు సకలస్తోత్రాలు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి) అని పలుకుతారో, అతడి కోసం స్వర్గంలో ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది."
[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 3464]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "సుబహానల్లాహ్" (అల్లాహ్ పరమ పవిత్రుడు), "అల్-అజీమ్" (అతను గొప్పవాడు, ఆయన అందరి కంటే, అన్నింటి కంటే మహోన్నతుడు —తన స్వరూపంలో, లక్షణాల్లో, క్రియల్లో), "వ బిహమ్దిహి" (సకల స్తోత్రాలు, కృతజ్ఞతలు ఆయనకు మాత్రమే శోభిస్తాయి ఎందుకంటే పరిపూర్ణమైన గుణాలు ఆయనకే ఉన్నాయని అంగీకరించడం), ఎవరైతే ఇలా పలుకుతారో, అలా పలికిన ప్రతిసారి, స్వర్గ భూమిలో అతడి కోసం ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది.