عن عثمان بن عفان رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «من توضَّأ فَأَحْسَن الوُضُوءَ، خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُج مِنْ تَحْتِ أَظْفَارِه».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ఎవరైతే ఉత్తమ రీతిలో వజూ చేస్తారో అతని పాపాలు శరీరం నుండి నశిస్తాయి,చివరికి అతని వేలు క్రింది నుండి పడిపోతాయి
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసు ‘వజూ అత్యంత ప్రాధాన్యత గల ఆరాధనల్లో ఒకటి అనే విషయాన్ని సాక్ష్య పరుస్తుంది,ఈ హదీసులో ప్రస్తావించబడ్డ ప్రాముఖ్యతల్లో ఒకటి ‘వజూ యొక్క మర్యాదలను సున్నతులకు ప్రాధాన్యత ఇస్తూ మంచిగా చేస్తాడు,అతని అల్లాహ్ హక్కులకు సంభంధించిన చిన్నచిన్న పాపాలు మన్నించ బడతాయి,అవి చేతిగొర్ల క్రింది సన్నని చర్మం నుంచి కూడా రాలిపోతాయి,అంచేత దాసుడు వజూ చేశాక అల్లాహ్ యొక్క ప్రీతిప్రసన్నతను ఆశించాలి మరియు మనోమస్తిశ్కాలలో చేసే ఈ పని అల్లాహ్ చెప్పిన ఈ ఆదేశానుసారమని గుర్తుంచుకోవాలి”{: "إذا قمتم إلى الصلاة، فاغسلوا وجوهكم" المائدة: 6} {ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి.మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి.}అంతే కాకుండా ఈ వజూ ద్వారా అతను మహనీయ దైవప్రవక్తను అనుసరిస్తున్నట్లు భావించాలి దానికి బదులు పుణ్యం లభిస్తుందని ఆశిస్తూ ఉండాలి తద్వారా అతను దానిని చక్కని రీతిలో ముగిస్తాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. వజూ మర్యాదలను మరియు షరతుల పట్ల జాగ్రత్త వహిస్తూ ఆ విధంగా కార్యసాధన చేయాలని ప్రోత్సహించబడుతుంది.
  2. వజూకు గల ఘనత మరియు పాపాలను అది ప్రక్షాలిస్తుంది అని ప్రభోదించబడుతుంది
  3. పాపాలు తప్పిదాలు ప్రక్షాళనకు ఖచ్చితమైన షరతు ఉత్తమంగా వజూ ఆచరించడం,మహనీయ దైవప్రవక్త తన ఉమ్మతు కు భోదించిన విధానాన్ని అనుసరించాలి
  4. వజూ షరతులను,సున్నతులను,మర్యాదలను మరియు దానిప్రకారముగా కార్యాచరణను నేర్చుకోవాలని ప్రోత్సహించబడుతుంది.