+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا تَوَضَّأَ أَحَدُكُمْ فَلْيَجْعَلْ فِي أَنْفِهِ ثُمَّ لِيَنْثُرْ، وَمَنِ اسْتَجْمَرَ فَلْيُوتِرْ، وَإِذَا اسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ نَوْمِهِ فَلْيَغْسِلْ يَدَهُ قَبْلَ أَنْ يُدْخِلَهَا فِي وَضُوئِهِ، فَإِنَّ أَحَدَكُمْ لاَ يَدْرِي أَيْنَ بَاتَتْ يَدُهُ». ولفظ مسلم: «إِذَا اسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ نَوْمِهِ فَلَا يَغْمِسْ يَدَهُ فِي الْإِنَاءِ حَتَّى يَغْسِلَهَا ثَلَاثًا، فَإِنَّهُ لَا يَدْرِي أَيْنَ بَاتَتْ يَدُهُ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "c2">“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి; మీలో ఎవరైనా తన నిద్ర నుండి లేచినపుడు, వుదూ చేయుట కొరకు నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు, తన చేతులను కడుగుకోవాలి, ఎందుకంటే మీలో ఎవరికీ తెలియదు తన చేతులు రాత్రి ఎక్కడ గడిపాయో”; సహీహ్ ముస్లింలో ఈ పదాలున్నాయి: "c2">“మీలో ఎవరైనా తమ నిద్ర నుండి లేచినపుడు, చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు, (వుజూ కొరకు) నీటి పాత్రలో చేతులను పెట్టకండి, ఎందుకంటే అతడికి తెలియదు తన చేయి రాత్రి ఎక్కడ గడిపిందో”
.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధత పొందు విషయానికి సంబంధించి కొన్ని నియమాలను వివరించారు. మొదటిది: ఎవరైనా వుజూ చేసినపుడు అతడు తన శ్వాస ద్వారా ముక్కులోనికి నీటిని తీసుకోవాలి, మరియు శ్వాస ద్వారా ఆ నీటిని చీదివేయాలి. రెండవది: శరీరమునుండి హానికరమైన పదార్థాలు బయటకు వచ్చినపుడు, నీళ్ళు గాక మరింక దేనితోనైనా, అంటే ఉదాహరణకు – చిన్నచిన్న రాళ్లు మొదలైన వాటితో – శుభ్రపరుచుకోవాలనుకుంటే వాటిని బేసి సంఖ్యలో ఉపయోగించాలి. కనిష్టంగా మూడింటిని ఉపయోగించాలి, గరిష్టంగా ఆ హానికర్మైన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు, ఆ ప్రదేశము పూర్తిగా శుభ్రపడేంత వరకు అవసరమైనన్ని ఉపయోగించవచ్చు. మూడవది: ఎవరైతే రాత్రి నిద్ర నుండి మేల్కొంటారో, వారు ముందు రెండు చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు వుదూ చేయడానికి నీటి పాత్రలో చేయి పెట్టరాదు. ఎందుకంటే, అతడు ఎరుగడు రాత్రి అతని చేయి ఎక్కడెక్కడ గడిపిందో. కనుక అతని చేతులు అశుద్ధత నుండి సురక్షితంగా లేవు అన్నమాట. అటువంటి స్థితిలో చేసిన వుదూను షైతాను పనికి రానిదిగా చేస్తాడు; అలాగే మానవ జీవితానికి హానికరమైన పదార్థాలు నీటిలో కలిసేలా చేసి, ఆ నీటిని కలుషితం చేస్తాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الغوجاراتية القيرقيزية النيبالية اليوروبا الدرية الصومالية الكينياروندا
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. వుజూ చేయునపుడు ముక్కులోనికి నీటిని (ఉఛ్వాస ద్వారా) పీల్చుట విధి: అంటే ఉఛ్వాస ద్వారా ముక్కులోనికి నీటిని ఎక్కించుట; అదే విధంగా ముక్కులోనికి ఎక్కించిన నీటిని నిశ్వాస ద్వారా చీది వేయుట కూడా విధియే.
  2. మూత్ర విసర్జన తరువాత బేసి సంఖ్యలో (చిన్నచిన్న) రాళ్ళను ఉపయోగించి శుభ్రపరుచుకొనుట అభిలషణీయమైన చర్య.
  3. రాత్రి నిద్ర తరువాత చేతులను మూడు సార్లు కడుక్కొనుట షరియత్ లో ఉన్న విషయం.