عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْخُلُ الْخَلَاءَ، فَأَحْمِلُ أَنَا وَغُلَامٌ نَحْوِي إِدَاوَةً مِنْ مَاءٍ وَعَنَزَةً فَيَسْتَنْجِي بِالْمَاءِ.

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 271]
المزيــد ...

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకొను ప్రదేశములోనికి ప్రవేశించినప్పుడు, నేను మరియు ఒక సేవకుడు ఒక నీటితో నిండిన తోలుతిత్తిని, ఒక చేతికర్రను తీసుకుని వెళ్ళే వాళ్ళము, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీటితో తనను తాను శుభ్రపరుచుకునేవారు.

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ ముస్లిం - 271]

వ్యాఖ్యానము

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చు కోవడానికి బయటకు వెళ్ళినప్పుడు, తాను మరియు దాదాపు అదే వయస్సు గల ఒక సేవకుడు ఆయనను అనుసరించేవారు. వారు ఒక అంచున ఈటె వంటి పదునైన భాగం ఉన్న ఒక చేతికర్రను వెంట తీసుకువెళ్లేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని నేలలో పాతి, తన గోప్యత కొరకు దానిపై ఏదైనా వస్త్రం లాంటిది వ్రేళ్ళాడదీసేవారు, లేదా దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను నమాజు ఆచరించునపుడు తన ముందు సుత్రాగా నేలలో పాతేవారు; అలాగే నీటితో నిండిన ఒక చిన్న తోలు తిత్తిని కూడా తీసుకువెళ్ళేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకొనుట పూర్తి చేసినపుడు వారిలో ఒకరు ఆయనకు ఆ తోలుతిత్తిని అందజేసేవారు, మరియు ఆయన ఆ తోలుతిత్తిలోని నీటితో తనను తాను శుభ్రపరచుకునేవారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఒక ముస్లిం కాలకృత్యాలు తీర్చుకోవలసిన అవసరం వస్తే, ముందుగానే తనను తాను శుబ్రపరుచుకునే సామాగ్రిని సిద్ధం చేసుకుంటాడు; తద్వారా కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరిచే సామాగ్రి కొరకు అటూఇటూ కదిలి మరింత మురికిగా మారకుండా ఉంటాడు.
  2. కాలకృత్యాలు తీర్చుకొనునపుడు తన మర్మాంగాలు ఇతరులకు కనబడకుండా పరిరక్షించుకోవడం ముఖ్యం; ఎందుకంటే ఇతరుల మర్మాంగాలను చూడడం నిషేధము. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, కాల కృత్యాలు తీర్చుకొనునపుడు నేలలో తన చేతి కర్రను దిగవేసి దానిపై ఏదైనా ఒక వస్త్రాన్ని తనకు అడ్డుగా కప్పివేసేవారు.
  3. పిల్లలకు ఇస్లామీయ మర్యాదలను, ఆచార వ్యవహారాలను బోధించాలి మరియు దానికి అనుగుణంగా వారిని పెంచడం జరగాలి, తద్వారా వారు దానిని వారసత్వంగా పొందుతారు.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (35)
వర్గీకరణలు
ఇంకా