عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«سَوُّوا صُفُوفَكُمْ، فَإِنَّ تَسْوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلَاةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 433]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీ పంక్తులను (వంకర లేకుండా) సరిచేసుకొోండి, ఎందుకంటే నిశ్చయంగా (వంకర లేకుండా) పంక్తులను సరి చేసుకోవడం సలాహ్ యొక్క (నమాజు యొక్క) పరిపూర్ణతలో భాగము.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 433]
సలాహ్ ఆచరించుటకు నిలబడిన వారిని తమ పంక్తులను (వంకర లేకుండా) సరి చేసుకోమని ఆదేశిస్తున్నారు. ఒకరికొకరు ఒక అడుగు ముందూ లేక వెనుకో నిలబడరాదని, పంక్తులను సరి చేసుకొనుట సలాహ్ యొక్క సంపూర్ణత మరియు పరిపూర్ణతలో భాగం అని, మరియు వరుసలు వంకరగా ఉండటం దానిలోని లోపం మరియు న్యూనత అని తెలియజేస్తున్నారు.