+ -

عَنْ عَائِشَةَ أُمِّ المؤمنين رضي الله عنها أَنَّ فَاطِمَةَ بِنْتَ أَبِي حُبَيْشٍ سَأَلَتِ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَتْ:
إِنِّي أُسْتَحَاضُ فَلاَ أَطْهُرُ، أَفَأَدَعُ الصَّلاَةَ؟ فَقَالَ: «لَا، إِنَّ ذَلِكِ عِرْقٌ، وَلَكِنْ دَعِي الصَّلاَةَ قَدْرَ الأَيَّامِ الَّتِي كُنْتِ تَحِيضِينَ فِيهَا، ثُمَّ اغْتَسِلِي وَصَلِّي».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 325]
المزيــد ...

ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఫాతిమా బింత్ అబీ హుబైష్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు:
(ఓ ప్రవక్తా!) బహిష్ఠు కారణంగా (బహిష్ఠు దినములు గడిచిపోయిన తరువాత కూడా) నాకు నిరంతరం రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగా నేను పరిశుద్ధత పొందలేకపోతున్నాను. నేను సలాహ్ కు (నమాజుకు) దూరంగా ఉండాలా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు “లేదు (నీవు సలాహ్ కు దూరంగా ఉండవలసిన అవసరం లేదు); అది ఒక రక్తనాళము. సాధారణంగా బహిష్ఠు ఎన్ని దినముల కొరకు ఉంటుందో అన్ని దినములు సలాహ్ కు దూరంగా ఉండు. ఆ తరువాత గుసుల్ చేసి నమాజులను ఆచరించు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 325]

వివరణ

ఫాతిమా బింత్ హుబైష్ రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు: “బహిష్ఠు కారణంగా, బహిష్ఠు దినములు పూర్తి అయిన తరువాత కూడా నాకు రక్తస్రావము జరుగుతూనే ఉంటుంది – మరొక బహిష్ఠు వచ్చేంత వరకు. నేను నమాజు దూరంగా ఉండడానికి బహిష్ఠుకు సంబంధించిన నియమాలే నా ఈ స్థితికి కూడా వర్తిస్తాయా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: “అది ‘ఇస్తిహాజహ్ రక్తస్రావము’ (పసుపు వర్ణపు స్రావముతో కూడిన రక్తము). అది అనారోగ్యకరమైనది; గర్భాశయములో రక్తనాళముల ఒరిపిడి కారణంగా జనించే తేమ కారణంగా స్రవించునటువంటిది. అది బహిష్ఠు రక్తము కాదు.” ప్రతి నెల వచ్చే విధంగా సమయానికి బహిష్ఠు వచ్చినపుడు – అంటే ఇస్తిహాదహ్ రక్తస్రావము మొదలు కావడం కంటే ముందు వరకు - ఆ బహిష్ఠు స్థితిలో ఉన్నన్ని రోజులు నమాజుకు, ఉపవాసములకు మరియు సాధారణంగా బహిష్ఠు స్త్రీ దూరంగా ఉండవలసిన అన్ని పనులకు దూరంగా ఉండాలి. బహిష్ఠు యొక్క సాధారణ కాల పరిమితి పూర్తి అయినపుడు, బహిష్ఠు స్థితి నుండి పరిశుద్ధత పొందాలి. ముందుగా రక్తస్రావము జరిగిన ప్రదేశాన్ని పుష్కలంగా నీటితో కడగాలి, తరువాత శరీరం మొత్తాన్ని సంపూర్ణంగా కడగాలి (గుసుల్ చేయాలి), తరువాత నమాజు ఆచరించాలి.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ Урумӣ Канада الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. బహిష్ఠు యొక్క సాధారణ కాలపరిమితి ముగిసిన వెంటనే స్త్రీ గుసుల్ ఆచరించి పరిశుద్ధత పొందుట విధి.
  2. ఇస్తిహాజా రక్తస్రావము జరుగుతున్న స్త్రీ కూడా నమాజు ఆచరించుట విధి.
  3. బహిష్ఠు (ఋతుస్రావము): కొన్ని నిర్ణీత దినముల కొరకు, గర్భాశయము సహజసిద్ధంగా యోని మార్గము ద్వార విడుదల చేసే రక్తము. ఆ స్థితిని ‘బహిష్ఠు’ లేదా ‘ఋతుస్రావము’ అంటారు.
  4. అల్-ఇస్తిహాదహ్: ఇది బహిష్ఠు దినముల తరువాత మిగతా దినములలో గర్భాశయము అడుగు భాగమునుండి స్రవించే రక్తము.
  5. బహిష్ఠు రక్తమునకు మరియు ఇస్తిహాజహ్ రక్తమునకు మధ్య భేదము: బహిష్ఠు రక్తము ఎక్కువగా నలుపు రంగులో ఉండి, ఎక్కువ గాఢత కలిగి ఉంటుంది మరియు దుర్వాసన కలిగి ఉంటుంది. ఇస్తిహాజహ్ రక్తము పలుచగా ఉంటుంది మరియు దుర్వాసన ఉండదు.