عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ رضي الله عنهما أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِذَا دَخَلَ الرَّجُلُ بَيْتَهُ، فَذَكَرَ اللهَ عِنْدَ دُخُولِهِ وَعِنْدَ طَعَامِهِ، قَالَ الشَّيْطَانُ: لَا مَبِيتَ لَكُمْ، وَلَا عَشَاءَ، وَإِذَا دَخَلَ، فَلَمْ يَذْكُرِ اللهَ عِنْدَ دُخُولِهِ، قَالَ الشَّيْطَانُ: أَدْرَكْتُمُ الْمَبِيتَ، وَإِذَا لَمْ يَذْكُرِ اللهَ عِنْدَ طَعَامِهِ، قَالَ: أَدْرَكْتُمُ الْمَبِيتَ وَالْعَشَاءَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2018]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను.
“ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”. మరియు (ఆ వ్యక్తి) ఇంటిలోనికి ప్రవేశిస్తే, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే షైతాను ఇలా అంటాడు “రాత్రి గడపాడానికి స్థలం దొరికింది”; మరియు (ఆ వ్యక్తి) భోజనం తినడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే, (షైతాను) ఇలా అంటాడు “రాత్రి గడపడానికి స్థలమూ మరియు భోజనమూ రెండూ దొరికాయి.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2018]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఇంటిలో ప్రవేశించడానికి ముందు మరియు భోజనం తినుట ప్రారంభించడానికి ముందు అల్లాహ్ పేరును స్మరించమని ఆదేశిస్తున్నారు. అల్లాహ్ పేరును స్మరించుట అంటే ఇంటిలో ప్రవేశించుటకు ముందు, మరియు భోజనం తినుట ప్రారంభించుటకు ముందు “బిస్మిల్లాహ్” అని పలుకుట. అపుడు షైతాను తన అనుచరులతో ఇలా అంటాడు: “మీకు ఈ ఇంటిలో రాత్రి గడిపే అవకాశం గానీ భోజనం చేసే అవకాశం గానీ లేవు; ఈ ఇంటి యజమాని అల్లాహ్ పేరును స్మరించుట ద్వారా మీనుండి తనను తాను రక్షించుకున్నాడు.” మరియు ఒకవేళ ఆ వ్యక్తి ఇంటిలోనికి ప్రవేశించినపుడు, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ పేరును స్మరించకపోయినా, భోజనం తినుట ప్రారంభించడానికి ముందు అల్లహ్ పేరును స్మరించకపోయినా, షైతాను తన అనుచరులతో ఇలా అంటాడు: “ఈ ఇంటిలో రాత్రి గడపడానికి, భోజనం చేయడానికి అవకాశం దొరికింది.”