+ -

عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ عَادَ مَرِيضًا، لَمْ يَحْضُرْ أَجَلُهُ فَقَالَ عِنْدَهُ سَبْعَ مِرَارٍ: أَسْأَلُ اللَّهَ الْعَظِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ أَنْ يَشْفِيَكَ، إِلَّا عَافَاهُ اللَّهُ مِنْ ذَلِكَ الْمَرَضِ».

[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 3106]
المزيــد ...

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
మరణ సమయం ఇంకా సమీపించని రోగిని సందర్శించి, అతని సమక్షంలో ఎవరైనా ఏడుసార్లు ఇలా అంటే అల్లాహ్ అతనిని ఆ వ్యాధి నుండి నయం చేస్తాడు: 'అస్’అలల్లాహుల్-‘అజీమ్ రబ్బుల్-‘అర్షిల్-‘అజిమ్ అన్ యష్ఫియక్ (నిన్ను నయం చేయమని నేను గొప్ప సింహాసనానికి అధిపతి అయిన అల్లాహ్‌ను అర్థిస్తున్నాను)'

[దృఢమైనది] - - [سنن أبي داود - 3106]

వివరణ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: 'ఇంకా తన మరణ సమయం సమీపించని, అనారోగ్యంతో పడి వున్న ముస్లింను ఎవరైనా ఒక ముస్లిం సందర్శించి, ఈ దుఆను ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోసం ఏడుసార్లు రిపీట్ చేస్తే, అల్లాహ్ ఆ వ్యక్తిని ఆ అనారోగ్యం నుండి తప్పక స్వస్థపరుస్తాడు."' దుఆ: "నిన్ను స్వస్థపరచాలని నేను అల్లాహుల్ అజీమ్‌ను వేడుకుంటున్నాను - ఆయన స్వరూపంలో, షిఫాతులలో, కార్యాలలో గొప్పవాడు, గొప్ప సింహాసనానికి ప్రభువు."

من فوائد الحديث

  1. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోసం ఈ దుఆను ఏడుసార్లు పునరావృతం చేయడం సున్నత్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచారం).
  2. ఈ దుఆ ఎవరి కోసం చేస్తారో, మహోన్నతుడైన అల్లాహ్ తన అనుమతితో ఆ వ్యక్తికి ఔషధం ప్రసాదిస్తాడు - కానీ ఈ క్రింది షరతులతో: దుఆ ఇఖ్లాస్‌తో (నిష్కపట హృదయంతో) చేయబడాలి, దుఆ చేసేవారు సాలిహ్ (సత్పురుషులైన) జీవితం గడపాలి అయి ఉండాలి, రోగి యొక్క మరణ సమయం సమీపించకుండా ఉండాలి.
  3. ఈ దుఆను నిశ్శబ్దంగా లేదా బిగ్గరగా చేయవచ్చు - రెండూ అనుమతించబడినవి. కానీ రోగి వినగలిగితే, బిగ్గరగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడాలి మరియు అలా చేయడం ఉత్తమం, ఎందుకంటే ఇది రోగి హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الموري الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా