عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مِنْ حُسْنِ إِسْلَامِ المَرْءِ تَرْكُهُ مَا لَا يَعْنِيهِ».
[قال النووي: حديث حسن] - [رواه الترمذي وغيره] - [الأربعون النووية: 12]
المزيــد ...
"అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖన, 'అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:'"
"ఒక వ్యక్తి కొరకు ఇస్లాంలోని ఒక ఉత్తమమైన విషయం ఏమిటంటే, తనకు సంబంధం లేని వాటిని వదిలిపెట్టడం."
[قال النووي: حديث حسن] - [رواه الترمذي وغيره] - [الأربعون النووية - 12]
"ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేసినారు: ఒక ముస్లిం యొక్క ఇస్లాం ఎంత పరిపూర్ణమైనదంటే, అతనికి సంబంధం లేని, అతనితో ప్రత్యేకంగా లేని, అతనికి ముఖ్యం కాని మరియు అతనికి ఏ ప్రయోజనం లేని మాటలు మరియు పనుల నుండి, లేదా ధర్మం మరియు ఈ లోకపు విషయాలలో తనకు సంబంధం లేని వాటి నుండి దూరంగా ఉండడం. ఎందుకంటే, ఒక వ్యక్తి తనకు సంబంధం లేని వాటిలో నిమగ్నమైతే, అది అతనికి ముఖ్యమైన వాటి నుండి దూరం చేయవచ్చు, లేదా అతను విడిచిపెట్టవలసిన వాటికి దారితీయవచ్చు. నిశ్చయంగా, ఒక వ్యక్తి తన పనులకు తీర్పు రోజున బాధ్యత వహిస్తాడు."