عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضيَ اللهُ عنهُما قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا أَسْكَرَ كَثِيرُهُ فَقَلِيلُهُ حَرَامٌ».
[حسن] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 3681]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారు:
“ఏ పదార్థమైనా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మత్తు కలిగించేట్లైతే, దానిని కొద్ది మొత్తంలో తీసుకోవడం కూడా నిషిద్ధం.”
[ప్రామాణికమైనది] - - [سنن أبي داود - 3681]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అని వివరిస్తున్నారు: మెదడును మొద్దుబారేలా చేసి, మానసిక సామర్థ్యాలపై నియంత్రణ కోల్పోయేలా చేసే ఏదైనా పానీయం లేదా ఆహారం ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం నిషేధించబడింది, అలాగే మెదడును మొద్దుబారేలా చేయకపోయినా – అటువంటి పదార్ధాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా నిషేద్ధమే.