عن أنس رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال:
«جَاهِدُوا المشركين بأموالكم وأنفسكم وألسنتكم».
[صحيح] - [رواه أبو داود والنسائي وأحمد] - [سنن أبي داود: 2504]
المزيــد ...
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీ సంపదలతో, మీ ఆత్మలతో (అంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి), మరియు మీ నాలుకలతో బహుదైవారాధకులతో పోరాడండి.”
[దృఢమైనది] - - [سنن أبي داود - 2504]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: అల్లాహ్ యొక్క వాక్కు సర్వోన్నతమైనదిగా ఉండేలా సత్యతిరస్కారులకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి పద్ధతిలో వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలని ఆదేశించారు, వాటిలో:
మొదటిది: అవిశ్వాసులతో పోరాడుట కొరకు యోధులకు ఆయుధాలను సమకూర్చుట కొరకు, మరియు సైనికులపై ఖర్చు చేయుట కొరకు మన సంపదను ఖర్చు చేయాలి.
రెండవది: సత్యతిరస్కారులను ఎదిరించడానికి, యుద్ధములో వారిని అధిగమించడానికి స్వయంగా నడుం బిగించి ముందుకు కదలాలి.
మూడవది: వారిని మౌఖిక మార్గాల ద్వారా ఇస్లాం వైపు ఆహ్వానించడం, వారికి వ్యతిరేకంగా సత్యాన్ని స్థాపించడం, వారి వాదనలను ఖండించడం మరియు వారి వాదనలను తిరస్కరించడం.