عن عبد الله بن عمرو رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«مَنْ قَتَلَ مُعَاهَدًا لَمْ يَرَحْ رَائِحَةَ الْجَنَّةِ، وَإِنَّ رِيحَهَا تُوجَدُ مِنْ مَسِيرَةِ أَرْبَعِينَ عَامًا».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3166]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
ఒప్పందం కుదుర్చుకున్నవ్యక్తిని హతమార్చినవాడు (హంతకుడు) స్వర్గము యొక్క సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; నిశ్చయంగా స్వర్గపు సుగంధము నలభై సంవత్సరాల (ప్రయాణపు) దూరము నుండి కూడా చూడగలిగినప్పటికీ. (ముఆహద్: ముస్లిముల రాజ్యములోనికి - తన ప్రాణానికి రక్షణ ఉంటుంది అనే ఒప్పందముపై - ప్రవేశించిన వ్యక్తి).
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 3166]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అతి తీవ్రమైన హెచ్చరికను గురించి తెలియజేస్తున్నారు – అది ఎవరైతే ఒక ‘ముఆహద్’ ను – అంటే అతడు అవిశ్వాసుల ప్రదేశము నుండి, ఇస్లామీయ రాజ్యము లోనికి ఏదైనా ఒప్పందంపై, మరియు రక్షణ ఒడంబడికపై ప్రవేశించిన అవిశ్వాసి అయి ఉంటాడు, అతడిని – చంపినట్లయితే, ఆ హంతకుడు స్వర్గపు సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; స్వర్గపు సుగంధము, నిజానికి, నలభై సంవత్సరాల (ప్రయాణమంత) దూరమునుండి కూడా చడగలిగినదై ఉన్నప్పటికీ.