عَنْ عُثْمَانَ الشَّحَّامِ، قَالَ: انْطَلَقْتُ أَنَا وَفَرْقَدٌ السَّبَخِيُّ إِلَى مُسْلِمِ بْنِ أَبِي بَكْرَةَ وَهُوَ فِي أَرْضِهِ، فَدَخَلْنَا عَلَيْهِ فَقُلْنَا: هَلْ سَمِعْتَ أَبَاكَ يُحَدِّثُ فِي الْفِتَنِ حَدِيثًا؟ قَالَ: نَعَمْ، سَمِعْتُ أَبَا بَكْرَةَ رضي الله عنه يُحَدِّثُ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّهَا سَتَكُونُ فِتَنٌ، أَلَا ثُمَّ تَكُونُ فِتْنَةٌ الْقَاعِدُ فِيهَا خَيْرٌ مِنَ الْمَاشِي فِيهَا، وَالْمَاشِي فِيهَا خَيْرٌ مِنَ السَّاعِي إِلَيْهَا، أَلَا فَإِذَا نَزَلَتْ أَوْ وَقَعَتْ فَمَنْ كَانَ لَهُ إِبِلٌ فَلْيَلْحَقْ بِإِبِلِهِ، وَمَنْ كَانَتْ لَهُ غَنَمٌ فَلْيَلْحَقْ بِغَنَمِهِ، وَمَنْ كَانَتْ لَهُ أَرْضٌ فَلْيَلْحَقْ بِأَرْضِهِ»، قَالَ فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ أَرَأَيْتَ مَنْ لَمْ يَكُنْ لَهُ إِبِلٌ وَلَا غَنَمٌ وَلَا أَرْضٌ؟ قَالَ: «يَعْمِدُ إِلَى سَيْفِهِ فَيَدُقُّ عَلَى حَدِّهِ بِحَجَرٍ، ثُمَّ لِيَنْجُ إِنِ اسْتَطَاعَ النَّجَاءَ، اللهُمَّ هَلْ بَلَّغْتُ؟ اللهُمَّ هَلْ بَلَّغْتُ؟ اللهُمَّ هَلْ بَلَّغْتُ؟»، قَالَ: فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ أَرَأَيْتَ إِنْ أُكْرِهْتُ حَتَّى يُنْطَلَقَ بِي إِلَى أَحَدِ الصَّفَّيْنِ، أَوْ إِحْدَى الْفِئَتَيْنِ، فَضَرَبَنِي رَجُلٌ بِسَيْفِهِ، أَوْ يَجِيءُ سَهْمٌ فَيَقْتُلُنِي؟ قَالَ: «يَبُوءُ بِإِثْمِهِ وَإِثْمِكَ، وَيَكُونُ مِنْ أَصْحَابِ النَّارِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2887]
المزيــد ...
ఉథ్మాన్ అష్షహ్హామ్ ఇలా పలికినారు: "నేను మరియు ఫర్కద్ అస్సబఖీ కలిసి, ముస్లిమ్ ఇబ్న్ అబూ బక్రా వద్దకు వెళ్లాం. ఆయన తన పొలంలో ఉన్నారు. మేము ఆయన వద్దకు వెళ్లి ఇలా అడిగినాము: 'మీరు మీ తండ్రి (అబూ బక్రా) నుండి ఫిత్నా (కలహాలు, గందరగోళం) గురించి ఏదైనా హదీథు విన్నారా?' దానికి ఆయన ఇలా చెప్పినారు: 'అవును, నేను నా తండ్రి అబూ బక్రా (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పడాన్ని విన్నాను అని పలికి, ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"నిశ్చయంగా కలహాలు (ఫిత్నా) సంభవిస్తాయి. తెలుసుకోండి! ఆ తర్వాత ఒక ఫిత్నా వస్తుంది. దానిలో కూర్చుని ఉండటం, నడుస్తున్నవాడి కంటే మేలు. నడుస్తున్నవాడు, దానివైపు పరిగెత్తేవాడి కంటే మేలు. ఆ కలహం సంభవించినప్పుడు, ఎవరికి ఒంటెలు ఉంటే వారు తమ ఒంటెల వద్దకు చేరుకోండి. ఎవరికి గొర్రెలు ఉంటే వారు తమ గొర్రెల వద్దకు చేరుకోండి. ఎవరికి భూమి ఉంటే వారు తమ భూమి వద్దకు చేరుకోండి." ఒక వ్యక్తి అడిగాడు: "ఓ అల్లాహ్ ప్రవక్తా! ఎవరికీ ఒంటెలు లేకుండా, గొర్రెలు లేకుండా, భూమి లేకుండా ఉంటే?" దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: "అతను తన కత్తిని తీసుకుని, దాని అంచుతో ఒక రాతిపై కొట్టాలి (కత్తిని నిరుపయోగం చేసుకోవాలి). తర్వాత సాధ్యమైతే ఏ విధంగానైనా తప్పించుకుని పారిపోవాలి. ఓ అల్లాహ్! నేను (ఈ సందేశాన్ని) చేరవేశానా? ఓ అల్లాహ్! నేను చేరవేశానా? ఓ అల్లాహ్! నేను చేరవేశానా?" మరొక వ్యక్తి ఇలా అడిగాడు: "ఓ అల్లాహ్ ప్రవక్తా! నన్ను బలవంతంగా రెండు పక్షాలలో ఒకదానిలో చేర్చి, అక్కడ ఎవరైనా నన్ను కత్తితో కొట్టి చంపితే, లేదా బాణం వచ్చి నన్ను చంపితే?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: "అతను (నిన్ను బలవంతం చేసినవాడు) నీ పాపాన్ని మరియు తన పాపాన్ని మోసుకుంటాడు. అతను నరక వాసులలో ఒకడు అవుతాడు."
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2887]
ఉథ్మాన్ అష్షహామ్ మరియు ఫర్ఖద్ అస్-సబ్ఖీలు గొప్ప సహాబా అబూ బక్రా రదియల్లాహు అన్హు కుమారుడైన ముస్లింను ఇలా అడిగారు, “ముస్లింల మధ్య జరిగే ఫిత్నాల అంటే కష్టాలు మరియు పోరాటాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి మీ తండ్రి ఏదైనా హదీథు విన్నారా?” అతను ఇలా అన్నాడు, “అవును, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన మరణం తర్వాత ఫిత్నాలు అంటే కష్టాలు ఉంటాయని మరియు ఈ ఫిత్నాలను విస్మరించి కూర్చోవడం అనేది వాటిని ఊహించకుండా లేదా వాటి కోసం వెతకకుండా వాటి గుండా నడవడం కంటే మంచిదని మాకు తెలియజేశారు, మరియు వాటి గుండా నడవడం అనేది వాటి వైపు పరుగెత్తడం, వాటిని వెతకడం మరియు వాటిలో పాల్గొనడం కంటే మంచిది అన్నారు.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన కాలంలో ఎవరికైనా ఏదైనా ఫిత్రాను అంటే కష్టాలు లేదా బాధలు ఎదురై ఆశ్రయం పొంద వలసి వస్తే, అక్కడ ఆశ్రయం పొందమని సలహా ఇచ్చారు - ఒంటెలు మేస్తున్న వారు తమ ఒంటెలను చేరాలి, గొర్రెలు మేస్తున్న వారు తమ గొర్రెలను చేరాలి, భూమి మరియు పొలం ఉన్న వారు తమ భూమిని చేరాలి. ఒక వ్యక్తి ఇలా అడిగినాడు: ఓ రసూలుల్లాహ్! ఆశ్రయం కోసం ఒంటెలు, గొర్రెలు లేదా భూమి లేని వ్యక్తి గురించి మీరు ఏమంటారు? దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అతడు తన ఆయుధాన్ని తీసుకొని, బండరాయిపై కొట్టి, నాశనం చేయాలి, ఆపై పారిపోయి తనను మరియు తన పిల్లలను రక్షించుకోగలిగేలా అక్కడి నుండి తప్పించుకోవాలి. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు సాక్ష్యం కొరకు ఇలా పలికినారు: ఓ అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? ఓ అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? అపుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! నేను రెండు వరుసలలో నుండి ఒకదానితో లేదా రెండు సమూహాలలో నుండి ఒకదానితో పాల్గొనవలసి వచ్చినపుడు, ఒక వ్యక్తి తన కత్తితో నన్ను నరికితే, లేదా ఒక బాణం వచ్చి నన్ను చంపితే, దాని గురించి మీరు ఏమంటారు? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అతడు తన పాపాన్ని మరియు తాను చంపిన వ్యక్తి పాపాన్ని మోస్తాడు మరియు పునరుత్థాన దినాన అతడు నరకవాసులలో ఉంటాడు.