عَنْ حُذَيْفَةَ رضي الله عنه قَالَ: كُنَّا عِنْدَ عُمَرَ رضي الله عنه، فَقَالَ: أَيُّكُمْ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَذْكُرُ الْفِتَنَ؟ فَقَالَ قوْمٌ: نَحْنُ سَمِعْنَاهُ، فَقَالَ: لَعَلَّكُمْ تَعْنُونَ فِتْنَةَ الرَّجُلِ فِي أَهْلِهِ وَجَارِهِ؟ قَالُوا: أَجَلْ، قَالَ: تِلْكَ تُكَفِّرُهَا الصَّلَاةُ وَالصِّيَامُ وَالصَّدَقَةُ، وَلَكِنْ أَيُّكُمْ سَمِعَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَذْكُرُ الَّتِي تَمُوجُ مَوْجَ الْبَحْرِ؟ قَالَ حُذَيْفَةُ: فَأَسْكَتَ الْقَوْمُ، فَقُلْتُ: أَنَا، قَالَ: أَنْتَ لِلَّهِ أَبُوكَ، قَالَ حُذَيْفَةُ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«تُعْرَضُ الْفِتَنُ عَلَى الْقُلُوبِ كَالْحَصِيرِ عُودًا عُودًا، فَأَيُّ قَلْبٍ أُشْرِبَهَا نُكِتَ فِيهِ نُكْتَةٌ سَوْدَاءُ، وَأَيُّ قَلْبٍ أَنْكَرَهَا نُكِتَ فِيهِ نُكْتَةٌ بَيْضَاءُ، حَتَّى تَصِيرَ عَلَى قَلْبَيْنِ، عَلَى أَبْيَضَ مِثْلِ الصَّفَا فَلَا تَضُرُّهُ فِتْنَةٌ مَا دَامَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ، وَالْآخَرُ أَسْوَدُ مُرْبَادًّا كَالْكُوزِ، مُجَخِّيًا لَا يَعْرِفُ مَعْرُوفًا، وَلَا يُنْكِرُ مُنْكَرًا، إِلَّا مَا أُشْرِبَ مِنْ هَوَاهُ»، قَالَ حُذَيْفَةُ: وَحَدَّثْتُهُ، أَنَّ بَيْنَكَ وَبَيْنَهَا بَابًا مُغْلَقًا يُوشِكُ أَنْ يُكْسَرَ، قَالَ عُمَرُ: أَكَسْرًا لَا أَبَا لَكَ؟ فَلَوْ أَنَّهُ فُتِحَ لَعَلَّهُ كَانَ يُعَادُ، قُلْتُ: لَا بَلْ يُكْسَرُ، وَحَدَّثْتُهُ أَنَّ ذَلِكَ الْبَابَ رَجُلٌ يُقْتَلُ أَوْ يَمُوتُ حَدِيثًا لَيْسَ بِالْأَغَالِيطِ. قَالَ أَبُو خَالِدٍ: فَقُلْتُ لِسَعْدٍ: يَا أَبَا مَالِكٍ، مَا أَسْوَدُ مُرْبَادٌّ؟ قَالَ: شِدَّةُ الْبَيَاضِ فِي سَوَادٍ، قَالَ: قُلْتُ: فَمَا الْكُوزُ مُجَخِّيًا؟ قَالَ: مَنْكُوسًا.
المزيد
హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “మేము ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్ద కూర్చుని ఉన్నాము. ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) (హఠాత్తుగా వచ్చిపడే) విపత్తు, ఆపద (అల్’ఫిత్నా) గురించి ప్రస్తావించడం విన్నారు? కొంతమంది “మేము విన్నాము” అన్నారు. దానికి ఆయన ఇలా అన్నారు: “బహుశా మీరు ఒక వ్యక్తికి తన కుటుంబములోని సమస్యలు, మరియు అతని పొరుగువారితో సమస్యలు గురించి అనుకుంటున్నారు, అవునా?” వారు “అవును” అన్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు: “అవి నమాజు, ఉపవాసం మరియు దానధర్మాల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడతాయి. కానీ మీలో ఎవరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సముద్రపు అలల వలె ఎగసిపడే ‘అల్-ఫిత్నా’ గురించి ప్రస్తావించగా విన్నారు?”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అక్కడున్న ప్రజలు మౌనంగా ఉండిపోయారు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను విన్నాను”. ఉమర్ రదియల్లాహు అన్హు “మీ తండ్రి నీ కొరకు త్యాగం చేయబడుగాక (మీ తండ్రి గొప్ప ధర్మపరుడు)”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
“రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) మనుషుల హృదయాలకు ప్రస్తుతపరచబడతాయి. ఏ హృదయమైతే వాటితో నిండిపోతుందో దానిపై ఒక నల్లటి మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిని తిరస్కరిస్తుందో దానిపై ఒక తెల్లని మచ్చ వేయబడుతుంది; అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. ఒకటి శ్వేత వర్ణములో, దానిపై ఏది పడినా దానికి అంటకుండా జారిపోయేటంతటి అతి నున్నటి ఉపరితలం కలిగిన రాయిలాగా, ఆకాశాలూ మరియు భూమి మిగిలి ఉన్నంత కాలం ఏ ప్రలోభాలూ, ఆకర్షణలూ తాకకుండా ఉంటుంది. మరియు మరొకటి నలుపు మరియు ధూళి రంగులో బోర్లించి ఉన్న పాత్రలాగా, మంచిని గుర్తించకుండా లేదా చెడును, కీడును తిరస్కరించకుండా, తాను నింపుకున్న వాంఛలు, మోహము, కోరికలతో నిండి ఉంటుంది.” హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మీకూ వాటికి (అల్ ఫితన్) మధ్య ఒక మూసివేసిన ద్వారం ఉంది. అది త్వరలోనే బ్రద్దలు కాబోతున్నది”. ఉమర్ రదియల్లాహు అన్హు “అది బ్రద్దలవుతుందా? నీకు తండ్రి లేకుండా పోవుగాక? ఒకవేళ అది తెరుచుకున్నా, తిరిగి అది మూసుకుపోవచ్చుకదా?” నేను ఇలా అన్నాను “లేదు అది బ్రద్దలవుతుంది”, నేను ఆయనకు వివరించాను “నిశ్చయంగా ఆ ద్వారము మనిషిని సూచిస్తుంది. అతడు చంపబడవచ్చు, లేదా చనిపోవచ్చు. ఈ హదీథులో ఎంతమాత్రమూ తప్పు అనేది లేదు. అబూ ఖాలిద్ ఇలా ఉల్లేఖించినారు నేను సా’అద్ తో ఇలా చెప్పాను “ఓ అబూ మాలిక్, “అస్వద్ ముర్బద్ద” అనే పదానికి అర్థం ఏమిటి?” దానికి అతడు “నలుపులో (కలిసిఉన్న) ఉత్తమ స్థాయి తెలుపు” అన్నాడు. నేను “మరి “అల్ కూజు ముజక్ఖియన్” అంటే అర్థం ఏమిటి?” అని ప్రశ్నించాను. దానికి అతడు: “అంటే అది బోర్లించబడి యున్న పాత్ర” అన్నాడు.