+ -

عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«خَيْرُكُمْ قَرْنِي، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ» قَالَ عِمْرَانُ: لاَ أَدْرِي أَذَكَرَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَعْدُ قَرْنَيْنِ أَوْ ثَلاَثَةً، قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِنَّ بَعْدَكُمْ قَوْمًا يَخُونُونَ وَلاَ يُؤْتَمَنُونَ، وَيَشْهَدُونَ وَلاَ يُسْتَشْهَدُونَ، وَيَنْذِرُونَ وَلاَ يَفُونَ، وَيَظْهَرُ فِيهِمُ السِّمَنُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2651]
المزيــد ...

ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"మీలో ఉత్తములు నా తరం వారు (సహాబాలు), తర్వాత వారిని అనుసరించే వారు (తాబియీన్), తర్వాత వారిని అనుసరించే వారు (అతబ్బ తాబియీన్)." ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు తరాలను గురించి చెప్పారా లేక మూడు తరాలను గురించి చెప్పారా అనే విషయం నాకు స్పష్టంగా గుర్తు లేదు." ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మీ తర్వాత కొంతమంది ప్రజలు వస్తారు – వారు విశ్వసిస్తారు, కానీ నమ్మదగినవారు కారు; వారు సాక్ష్యం చెబుతారు, కానీ వారిని సాక్షిగా అడగరు; వారు ప్రతిజ్ఞ చేస్తారు, కానీ నెరవేర్చరు; వారి మధ్య మోటుదనం (అధిక బరువు/సుఖ జీవనం) విస్తరించి, లావుగా ఉంటారు."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2651]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ప్రజలలో ఉత్తమమైన తరం అంటే నేను (ప్రవక్తగా) మరియు నా సహాబాలు (సహచరులు) ఉన్న తరం. వారి తర్వాత తాబియీన్ (సహాబాలను కలిసిన, మరియు ప్రవక్తను కలవని విశ్వాసులు) వస్తారు. ఆ తర్వాత తబ్బఅ-తాబియీన్ (తాబియీన్ అనుచరులు) వస్తారు." ఈ హదీథును ఉల్లేఖించిన సహాబీ (రదియల్లాహు అన్హు) నాల్గవ తరం గురించి చెప్పడంలో సందేహించారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "వారి తర్వాత (ఉత్తమ తరాల తర్వాత) కొంతమంది ప్రజలు వస్తారు – వారు ద్రోహం చేస్తారు, ప్రజలు వారిని నమ్మరు; వారు సాక్ష్యం చెబుతారు, కానీ వారి సాక్షి చెల్లదు; వారు ప్రతిజ్ఞ చేస్తారు, కానీ నెరవేర్చరు; వారు తినే, త్రాగే విషయాల్లో విస్తృతంగా ప్రవర్తిస్తారు (అధికంగా తింటారు, త్రాగుతారు), చివరికి వారి మధ్య మోటుదనం (అధిక బరువు) విస్తరిస్తుంది."

من فوائد الحديث

  1. ప్రపంచ చరిత్ర మొత్తంలో అత్యుత్తమ శతాబ్దం మరియు తరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు నివసించిన శతాబ్దం. సహీహ్ అల్-బుఖారీలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారని నమోదు చేయబడింది: "నేను ఆదాము సంతానంలో ఒకదాని తరువాత ఒకటి ఉత్తమ తరాలలో, నేను ఉన్న తరంలో పంపబడ్డాను."
  2. ఇబ్నె హజర్ ఇలా అన్నారు: ఈ హదీథు ప్రకారం సహాబాలు, తాబయీనుల కంటే గొప్పవారు, మరియు తాబయీనులు వారి తరువాత వచ్చిన తబ్బఅ తాబయీనుల కంటే గొప్పవారు. కానీ ఈ గొప్పతనం మొత్తం తరానికి వర్తిస్తుందా లేదా వ్యక్తులకు వర్తిస్తుందా అనేది చర్చనీయాంశం, మరియు మెజారిటీ అభిప్రాయం అదే.
  3. ఇది మొదటి మూడు తరాల మార్గాన్ని అనుసరించవలసిన ఆవశ్యకతను ఎత్తి చూపుతున్నది; ప్రవక్త కాలానికి దగ్గరగా జీవించిన వారు సద్గుణం, జ్ఞానం, అనుకరణ వలన ప్రవక్త మార్గదర్శకత్వాన్ని అనుసరించినవారిని అనుసరించడంలో ఎక్కువ అర్హులు, అల్లాహ్ వారిని ఆశీర్వదించి, వారికి శాంతిని ప్రసాదించుగాక.
  4. నజర్ అంటే: ఒక బాధ్యత కలిగిన వ్యక్తి (సమర్థుడు, ముకల్లఫ్) తనపై స్వయంగా ఒక ఆజ్ఞను విధించడం, అది ఇస్లామీయ చట్టం ద్వారా తప్పనిసరి చేయబడలేదు, కానీ అతను తన మాట లేదా చర్య ద్వారా ఆ ఆజ్ఞను తనపై తప్పనిసరిగా చేసుకుంటాడు.
  5. ద్రోహాన్ని, ప్రమాణాలను నెరవేర్చడంలో వైఫల్యాన్ని మరియు ప్రాపంచిక జీవితం పట్ల మితిమీరిన అనుబంధాన్ని ఖండించడం.
  6. న్యాయమూర్తి సాక్ష్యం చెప్పడానికి పిలవకుండానే సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం ఖండించబడింది - ముఖ్యంగా దానికి ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నప్పుడు. ఒకవేళ అలా కాని పక్షంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ముస్లిం హదథు గ్రంథంలో నమోదు అయిన ఈ హదీథు వర్తిస్తుంది, [మీలో ఉత్తమ సాక్ష్యులు ఎవరో తెలుపనా? ఎవరైతే అడగకుండానే ముందుకు వచ్చి సాక్ష్యం పలుకుతారో]
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ రష్యన్ సింహళ వియత్నమీస్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా