عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ افْتَقَدَ ثَابِتَ بْنَ قَيْسٍ، فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ، أَنَا أَعْلَمُ لَكَ عِلْمَهُ، فَأَتَاهُ فَوَجَدَهُ جَالِسًا فِي بَيْتِهِ، مُنَكِّسًا رَأْسَهُ، فَقَالَ: مَا شَأْنُكَ؟ فَقَالَ شَرٌّ، كَانَ يَرْفَعُ صَوْتَهُ فَوْقَ صَوْتِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَدْ حَبِطَ عَمَلُهُ، وَهُوَ مِنْ أَهْلِ النَّارِ، فَأَتَى الرَّجُلُ فَأَخْبَرَهُ أَنَّهُ قَالَ كَذَا وَكَذَا، فَرَجَعَ الْمَرَّةَ الْآخِرَةَ بِبِشَارَةٍ عَظِيمَةٍ، فَقَالَ: «اذْهَبْ إِلَيْهِ فَقُلْ لَهُ: إِنَّكَ لَسْتَ مِنْ أَهْلِ النَّارِ، وَلَكِنْ مِنْ أَهْلِ الْجَنَّةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3613]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు ను గురించి (అతడు చాలా కాలంగా కనిపించకపోవడంతో) వాకబు చేసినారు. అక్కడ ఉన్న వారిలో ఒకతను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మీకొరకు అతడిని గురించి తెలుసుకుని వస్తాను” అని పలికి, అతని (సాబిత్ బిన్ ఖైస్) వద్దకు వెళ్ళాడు. సాబిత్ బిన్ ఖైస్ తన ఇంటిలో తలను క్రిందకు వేలాడదీసుకుని (విచారములో మునిగిపోయినట్లుగా) కూర్చుని ఉండుట గమనించి “విషయం ఏమిటి” అని అడిగాడు. దానికి అతడు “కీడు” అన్నాడు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షములో వారి స్వరానికి మించి పై స్థాయిలో మాట్లాడేవాడు. కనుక తన సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, వ్యర్థమై పోయాయి, తానింక నరకవాసులలోని వాడై పోయాడు (అని బాధపడసాగినాడు). ఆ వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళి ‘అతడు ఇలా ఇలా అన్నాడు’ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారమిచ్చినాడు. తర్వాత ఆ వ్యక్తి సాబిత్ వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అమోఘమైన శుభవార్తతో తిరిగి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “అతని వద్దకు వెళ్ళు, వెళ్ళి ‘నీవు నరకవాసులలోని వాడవు కావు, నీవు స్వర్గవాసులలోని వాడవు” అని అతనికి చెప్పు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3613]
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు ను గురించి వాకబు చేసినారు. వారిలో ఒకతను “మీ కొరకు అతడి సమాచారాన్ని, అతడి గైరుహాజరు కారణాన్ని కనుక్కొని వస్తాను” అని అతని వద్దకు వెళ్ళి, అతడు తన ఇంటిలో తల వేలాడ దీసుకుని విచారములో మునిగి కూర్చుని ఉండడాన్ని చూసి “విషయం ఏమిటి?” అని అడిగాడు. దానికి సాబిత్ తనకు జరిగిన కీడు ఏమిటో చెప్పాడు. సాబిత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షములో, వారి స్వరానికి మించి, పై స్థాయిలో మాట్లాడుతూ ఉండేవాడు. అలా చేసిన వాని గురించి అల్లాహ్ ‘అటువంటి వాని సత్కార్యాలు అన్నీ వృథా చేయబడతాయి, మరియు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు’ అని హెచ్చరించినాడు.
అది విని ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి అతడి విషయాన్ని వివరించాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని సాబిత్ వద్దకు తిరిగి వెళ్ళి, అతడు నరకవాసులలోని వాడు కాదని, అతడు స్వర్గవాసులలోని వాడనే అమోఘమైన శుభవార్తను అతనికి వినిపించమని ఆదేశించినారు. ఎందుకంటే అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వక్తగా వ్యవహరించేవాడు మరియు అన్సారులలో ధర్మప్రసంగీకునిగా పనిచేసేవాడు, ఇంకా అతని స్వరం సహజంగానే ఉచ్ఛస్థాయిలో ఉండేది.