+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ يَوْمَ خَيْبَرَ:
«لَأُعْطِيَنَّ هَذِهِ الرَّايَةَ رَجُلًا يُحِبُّ اللهَ وَرَسُولَهُ، يَفْتَحُ اللهُ عَلَى يَدَيْهِ» قَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ: مَا أَحْبَبْتُ الْإِمَارَةَ إِلَّا يَوْمَئِذٍ، قَالَ فَتَسَاوَرْتُ لَهَا رَجَاءَ أَنْ أُدْعَى لَهَا، قَالَ فَدَعَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ، فَأَعْطَاهُ إِيَّاهَا، وَقَالَ: «امْشِ، وَلَا تَلْتَفِتْ، حَتَّى يَفْتَحَ اللهُ عَلَيْكَ» قَالَ فَسَارَ عَلِيٌّ شَيْئًا ثُمَّ وَقَفَ وَلَمْ يَلْتَفِتْ، فَصَرَخَ: يَا رَسُولَ اللهِ، عَلَى مَاذَا أُقَاتِلُ النَّاسَ؟ قَالَ: «قَاتِلْهُمْ حَتَّى يَشْهَدُوا أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، فَإِذَا فَعَلُوا ذَلِكَ فَقَدْ مَنَعُوا مِنْكَ دِمَاءَهُمْ وَأَمْوَالَهُمْ، إِلَّا بِحَقِّهَا وَحِسَابُهُمْ عَلَى اللهِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2405]
المزيــد ...

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఖైబర్ యుద్ధము జరిగిన దినమున రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా, అల్లాహ్‌ను మరియు అతని ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి నేను ఈ జెండా ఇస్తాను మరియు అల్లాహ్ అతని చేతుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు”. ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నాయకత్వం కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు, ఆ రోజు తప్ప”. ఆయన ఇంకా ఇలా అన్నారు: "(ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్నే పిలుస్తారు అనే ఆశతో) నేను దాని కోసం పిలువబడతాను అనే ఆశతో, వారి దృష్టిలో పడేలా నేను అటూ ఇటూ తిరుగసాగాను.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను పిలిపించి, ఆ జెండాను ఆయన చేతికి ఇచ్చి, ఇలా అన్నారు:(ఓ అలీ!) ముందుకు సాగు, అల్లాహ్ నీకు విజయాన్ని ప్రసాదించే వరకు వెనుకకు చూడకు”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “అలీ ముందుకు కదిలాడు, కొద్ది దూరంలో ఆగి, వెనుకకు తిరగకుండా, గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్! నేను ఏ విషయంపై ఆ ప్రజలతో పోరాడాలి?”; దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప వెరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యమిచ్చే వరకు వారితో పోరాడు. వారు ఒకవేళ అలా చేసినట్లయితే వారి రక్తము మరియు సంపదలు నీ కొరకు ఉల్లంఘించరానివి (హరాం) అవుతాయి - షరియత్ ప్రకారం అలా చేయవలసి వస్తే తప్ప; మరియు వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది.”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2405]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు ఇలా తెలియజేసారు: మరుసటి రోజు తాను జెండా ఎవరి చేతికైతే ఇస్తానో, ఆ వ్యక్తి చేతిలో, మదీనా సమీపంలోని ఖైబర్ అనే నగరపు యూదులపై ముస్లింలు విజయం సాధిస్తారు. ఇక్కడ జెండా అంటే, యుద్ధానికి బయలుదేరి వెళ్ళే సైన్యం, జెండాను తన నినాదంగా తీసుకుంటుంది. ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటంటే అతను అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.
ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు: తాను ఎప్పుడూ నాయకత్వం కావాలని ఇష్టపడలేదు - ఆ (ఖైబర్) దినమున తప్ప; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని ప్రేమను పొందగలను అని ఆశపడ్డానని పేర్కొన్నారు. ఆ బృహత్కార్యం కొరకు తాను పిలువబడతాను అని, ఆ జెండాను తానే తీసుకోవాలి అనే ఆసక్తితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో పడాలని తన ఛాతీని విశాలంగా చేసినాను అని పేర్కొన్నారు.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను పిలిచి ఆ జెండాను ఆయన చేతికి అందించి ఇలా ఆదేశించినారు “సైన్యంతో ముందుకు కదులు, యుద్ధభూమిలో శత్రువును ఎదుర్కొన్నపుడు, అల్లాహ్ నీకు ఈ కోటలపై విజయం మరియు ఆధిపత్యాన్ని ఇచ్చే వరకు యుద్ధభూమిని విడువకు - విశ్రాంతి కొరకో, లేక కొద్దిపాటి విడుపు ప్రకటించినప్పుడో, లేక యుద్ధవిరామం ప్రకటించినప్పుడో తప్ప .”
అలీ (రదియల్లాహు అన్హు) జెండా తీసుకుని ముందుకు కదిలారు. కొద్ది దూరం వెళ్ళి ఆగినారు, అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు అవిధేయత చూపినట్లవుతుందని, ఆయన వెనుక వైపుకు తిరగలేదు. ఆ విధంగానే నిలబడి ఆయన తన స్వరాన్ని పెంచి బిగ్గరగా “ఓ ప్రవక్తా(సల్లల్లాహు అలైహి వసల్లం)! ఆ ప్రజలతో నేను ఏ విషయంపై పోరాడాలి?” అని ప్రశ్నించారు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారు ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలకనంతవరకు వారితో పోరాడు; వారు ఒకవేళ (నీ పిలుపుకు) ప్రతిస్పందించి ఇస్లాంలోనికి ప్రవేశించినట్లయితే వారి రక్తం మరియు సంపదలు మీ నుండి రక్షించబడతాయి మరియు అవి మీ కొరకు నిషేధించబడినవి అవుతాయి; అయితే ధర్మబద్ధంగా అలా చేయవలసిన అవసరం ఏర్పడితే తప్ప, అంటే వారు ఇస్లాం చట్టం తీర్పుల ప్రకారం (షరియత్ ప్రకారం) వారు చంపబడవలసిన నేరం లేదా అపరాధం చేస్తే తప్ప. వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది.

من فوائد الحديث

  1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు నాయకత్వం పొందడాన్ని అయిష్టపడేవారు; ఎందుకంటే నాయకత్వం గొప్ప బాధ్యత కలిగి ఉంటుంది కనుక.
  2. మంచిది అని, శుభం కలిగినది అని నిర్ధారించబడిన విషయం కొరకు ఆశపడటం మరియు ఎదురు చూడటం అనుమతించదగినదే.
  3. యుద్ధభూమిలో ఎలా వ్యవహరించాలో పాలకుడు సైన్యాధిపతికి మార్గనిర్దేశం చేస్తాడు.
  4. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు కట్టుబడి ఉండేవారు, వాటిని అమలు చేయడానికి తొందరపడేవారు.
  5. ఒక వ్యక్తి తనకు కేటాయించిన కార్యాన్ని గురించి సందిగ్ధ స్థితికి లోనైనపుడు, అతను దాని గురించి విచారించాలి.
  6. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వపు చిహ్నాలలో ఒకటి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యూదులపై విజయం గురించి తెలియజేయడం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఖైబర్ విజయం గురించి ముందుగానే తెలియజేసారు మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లే జరిగింది.
  7. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను అమలు చేయడానికి త్వరపడాలని మరియు చొరవ తీసుకోవాలని మనకు ఇందులో ప్రోత్సాహము కనిపిస్తుంది.
  8. విశ్వాస ప్రకటన యొక్క రెండు సాక్ష్యపు వాక్యాలను ఉచ్ఛరించిన వ్యక్తిని, అందుకు వ్యతిరేకంగా అతని నుండి ఏమీ కనిపించనంత వరకు అతణ్ణి చంపడం నిషేధం.
  9. ఇస్లాం ధర్మం లోని తీర్పులు (షరియత్ యొక్క ఆదేశాలు) వ్యక్తులలో పైకి కనిపించే విషయాలకు వర్తిస్తాయి. అయితే వారు దాచిన అంశాలు అల్లాహ్‌కు అప్పగించబడ్డాయి.
  10. ప్రజలు ఇస్లాంను స్వీకరించేలా చేయడమే జిహాద్ వెనుక ఉన్న గొప్ప ఉద్దేశ్యం.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الرومانية المجرية الموري Урумӣ الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా