عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَوْ كَانَ لِابْنِ آدَمَ وَادِيَانِ مِنْ مَالٍ لَابْتَغَى وَادِيًا ثَالِثًا، وَلَا يَمْلَأُ جَوْفَ ابْنِ آدَمَ إِلَّا التُّرَابُ، وَيَتُوبُ اللهُ عَلَى مَنْ تَابَ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1048]
المزيــد ...

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఒకవేళ ఆదము సంతానానికి రెండు లోయల నిండా సంపద ఉన్నా, అతను మూడవ లోయను కోరుకుంటాడు. ఆదము సంతానం యొక్క కడుపును ధూళి (మట్టి) తప్ప మరేమీ నింపదు, మరియు అల్లాహ్ పశ్చాత్తాపపడేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు.”

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ ముస్లిం - 1048]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక మానవుడికి బంగారంతో నిండిన లోయ ఉంటే, అతనిలో సహజంగా ఉండే దురాశ కారణంగా, అతను మరో రెండు లోయలు కావాలని కోరుకుంటాడు. అతను చనిపోయే వరకు మరియు అతని కడుపు అతని సమాధి దుమ్ముతో నిండిపోయే వరకు ఈ ప్రపంచం కోసం దురాశ పడుతూనే ఉంటాడు.

من فوائد الحديث

  1. ఈ హదీథు సంపద మరియు ఇతర ప్రాపంచిక సుఖాలను కూడబెట్టుకోవాలనే మానవుడి తీవ్రమైన కోరికను తెలియజేస్తున్నది.
  2. ఇమాం అన్-నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఈ హదీథు ప్రాపంచిక వస్తువులపై దురాశను, వాటిని కూడబెట్టుకోవాలనే కోరికను మరియు వాటిపై వాంఛను ఖండిస్తున్నది.
  3. ఖండించదగిన లక్షణాల నుండి పశ్చాత్తాపపడే వారి పశ్చాత్తాపాన్ని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అంగీకరిస్తాడు.
  4. ఇమాం అన్-నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఈ హదీథు ప్రాపంచిక విషయాల పట్ల మనుషులలో ప్రబలంగా ఉండే కోరికను సూచిస్తున్నది, ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క "మరియు దేవుడు పశ్చాత్తాపపడేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు – అనే వాక్యము ద్వారా ధృవీకరించబడింది."
అనువాదాలను వీక్షించండి
భాష: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇంకా (33)
ఇంకా