+ -

عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه قَالَ:
كَانَتْ عَامَّةُ وَصِيَّةِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ حَضَرَهُ الْمَوْتُ: «الصَّلَاةَ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ، الصَّلَاةَ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ»، حَتَّى جَعَلَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُغَرْغِرُ بِهَا صَدْرُهُ، وَمَا يَكَادُ يُفِيضُ بِهَا لِسَانُهُ.

[صحيح] - [رواه النسائي في السنن الكبرى وابن ماجه] - [مسند أحمد: 12169]
المزيــد ...

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సమీపించినప్పుడు, ఆయన చివరిగా ముఖ్యమైన ఉపదేశం చేసినారు: "నమాజును (సలాత్) పాటించండి, మీ కుడి చేయి కలిగి ఉన్న వారిని (మీ ఆధీనంలో ఉన్న మీ సేవకులను, బానిసలను) దయగా చూడండి. నమాజును పాటించండి, మీ ఆధీనంలో ఉన్న వారిని దయగా చూడండి." రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో కూడా ఆయన గుండెలో ఈ మాటలు ప్రతిధ్వనించాయి, ఆయన నాలుక మీద కూడా ఈ పదాలు చివరి వరకు వినిపించాయి.

[దృఢమైనది] - - [مسند أحمد - 12169]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చివరి శ్వాసల్లో తన సమాజానికి మాటి మాటికీ ఇచ్చిన ఉపదేశం: "నమాజును (సలాత్) పాటించండి, దాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అలాగే, మీ ఆధీనంలో ఉన్న సేవకులకు, బానిసులకు వారి హక్కులను ఇవ్వండి, వారిని దయగా చూడండి." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో ఈ మాటలను పదే పదే పునరావృతం చేస్తూ, చివరికి ఆయన గొంతులో ఈ మాటలు మాత్రమే మోగుతూ ఉండినాయి, నాలుక స్పష్టంగా పలకలేని స్థితిలో కూడా ఈ ఉపదేశాన్ని విడిచిపెట్టలేదు.

من فوائد الحديث

  1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చివరి ఘడియలో తన సమాజానికి ఇచ్చిన ముఖ్యమైన ఉపదేశం ఈ రెండు ముఖ్యాంశాల గురించి ఉన్నది: నమాజు యొక్క మహిమ మరియు మీ ఆధీనంలో ఉన్న సేవకుల హక్కులు.
  2. నమాజు అనేది అల్లాహ్ కు తన దాసులపై ఉన్న అత్యంత గొప్ప హక్కులలో ఒకటి. అలాగే, ఇతరుల హక్కులను, ముఖ్యంగా బలహీనులు మరియు మన ఆధీనంలో ఉన్నవారి హక్కులను కాపాడటం అనేది మానవులపై ఉన్న గొప్ప బాధ్యతలలో ఒకటి.
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ బెంగాలీ టర్కిష్ రష్యన్ సింహళ వియత్నమీస్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الموري Малагашӣ الجورجية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా