عَنْ أَبِي مُحَمَّدٍ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ العَاصِ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يَكُونَ هَوَاهُ تَبَعًا لِمَا جِئْتُ بِهِ».
[قال النووي: حديث صحيح] - [رويناه في كتاب الحجة بإسناد صحيح] - [الأربعون النووية: 41]
المزيــد ...
అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"మీలో ఎవరూ విశ్వాసి కాలేడు - నేను తెచ్చిన దానికి అతని కోరికలు అనుసరించేలా చేసేంత వరకు."
-
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: ఒక వ్యక్తి తన విశ్వాసంలో పరిపూర్ణతను పొందలేడు - అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన ఆజ్ఞలు, నిషేధాలు మరియు ఇతర విషయాలను ప్రేమించేంత వరకు. తద్వారా అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన వాటిని ప్రేమిస్తాడు, మరియు ఆయన నిషేధించిన వాటిని ద్వేషిస్తాడు.