عن عمرو بن شُعيب عن أبيه عن جدِّه قال: قال رسولُ الله صلى الله عليه وسلم:
«مُرُوا أولادكمِ بالصلاةِ وهم أبناءُ سبعِ سِنينَ، واضرِبوهم عليها وهم أبناءُ عَشرٍ، وفرِّقوا بينهم في المَضاجِعِ».
[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 495]
المزيــد ...
అమ్ర్ ఇబ్న్ షుఐబ్ రజియల్లాహు అన్హు తన తండ్రి నుండి, ఆయన తన తండ్రి (అమ్ర్ ఇబ్న్ షుఐబ్ తాత) నుండి ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.”
[ప్రామాణికమైనది] - [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు] - [سنن أبي داود - 495]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరిస్తున్నారు: “తన సంతానం – ఆడపిల్లలు మరియు మగ పిల్లలు – ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు, సలాహ్ ఆచరించమని ఆదేశించడం, మరియు వారు సలాహ్ ఆచరించడానికి కావలసిన ఙ్ఞానాన్ని వారికి పొందుపరచడం (ప్రతి) తండ్రి యొక్క విధి. మరియు వారు (సంతానం) పది సంవత్సరాల వయసుకు చేరుకుంటే ఈ విషయం మరింత గంభీరమవుతుంది. అపుడు వారు సలాహ్ ఆచరించుటలో అలసత్వం, సోమరితనం వహిస్తే వారిని దండించాలి; అలాగే ఆడపిల్లల మరియు మగపిల్లల పడకలు వేరు చేయాలి.