+ -

عَنِ الْمِقْدَادِ بْنِ الْأَسْوَدِ رَضيَ اللهُ عنهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ:
«تُدْنَى الشَّمْسُ يَوْمَ الْقِيَامَةِ مِنَ الْخَلْقِ، حَتَّى تَكُونَ مِنْهُمْ كَمِقْدَارِ مِيلٍ»، قَالَ سُلَيْمُ بْنُ عَامِرٍ: فَوَاللهِ مَا أَدْرِي مَا يَعْنِي بِالْمِيلِ؟ أَمَسَافَةَ الْأَرْضِ، أَمِ الْمِيلَ الَّذِي تُكْتَحَلُ بِهِ الْعَيْنُ قَالَ: «فَيَكُونُ النَّاسُ عَلَى قَدْرِ أَعْمَالِهِمْ فِي الْعَرَقِ، فَمِنْهُمْ مَنْ يَكُونُ إِلَى كَعْبَيْهِ، وَمِنْهُمْ مَنْ يَكُونُ إِلَى رُكْبَتَيْهِ، وَمِنْهُمْ مَنْ يَكُونُ إِلَى حَقْوَيْهِ، وَمِنْهُمْ مَنْ يُلْجِمُهُ الْعَرَقُ إِلْجَامًا» قَالَ: وَأَشَارَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِيَدِهِ إِلَى فِيهِ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2864]
المزيــد ...

రసూలల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నానని మిఖ్దాద్ బిన్ అస్వద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు:
ప్రళయ దినాన, సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు — కేవలం ఒక "మీల్" అంత దూరంలో మాత్రమే ఉంటాడు. సులైమ్ బిన్ ఆమిర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన 'మీల్' అంటే భూమిపై మైలు దూరమా లేక కాటుకను కంటికి పెట్టే చిన్న 'మీల్' అని అర్థమా నాకు తెలియదు." ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలను బట్టి చెమటలో మునిగి ఉంటారు. వారిలో కొందరికి చెమట కాలి చీలమండలము వరకూ, కొందరికి మోకాళ్ల వరకూ, కొందరికి నడుము వరకూ, మరి కొందరికి చెమట నోటిదాకా ఉంటుంది." అని పలుకుతూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో తన నోటివైపు చూపించారు.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2864]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ప్రళయ దినాన సూర్యుడు ప్రజలకు చాలా దగ్గరగా తీసుకురాబడతాడు. వారి తలలకు కేవలం ఒక మైలు (మీల్) దూరంలో మాత్రమే ఉంటాడు. తాబియీ తరానికి చెందిన సులైమ్ బిన్ ఆమిర్ ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్న 'మీల్' అంటే, ఆయన భూమిపై మైలు దూరాన్ని ఉద్దేశించారా, లేక కంటికి కాటుక (సుర్మా) పెట్టే చిన్న కడ్డీని ('మీల్') ఉద్దేశించారా అనేది నాకు అర్థం కాలేదు." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రళయ దినాన ప్రజలు తమ తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి ఉంటారు. వారిలో కొందరికి చెమట కాలి చీలమండలముల వరకూ ఉంటుంది, కొందరికి మోకాళ్ల వరకూ, మరికొందరికి నడుము వరకూ, ఇంకొంతమందికి చెమట నోటిదాకా చేరి, వారు మాట్లాడలేని స్థితిలో ఉంటారు." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో తన నోటివైపు చూపించారు.

من فوائد الحديث

  1. ఈ హదీథులో ప్రళయ దినం యొక్క భయంకర దృశ్యాలను స్పష్టంగా వివరించుట మరియు వాటి నుండి హెచ్చరించుట జరిగింది.
  2. ప్రళయ దినాన ప్రజలు నిలబడే మహషర్ మైదానంలో తమ తమ కర్మల ప్రకారం ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తారు.
  3. మంచి పనులు చేయమని ప్రోత్సహించడం మరియు చెడు పనులు చేయవద్దని హెచ్చరించడం.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية Малагашӣ الجورجية المقدونية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా