عَنْ مُعَاوِيَةَ رَضيَ اللهُ عنهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«الْمُؤَذِّنُونَ أَطْوَلُ النَّاسِ أَعْنَاقًا يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 387]
المزيــد ...
ముఆవియహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
“తీర్పు దినము నాడు ప్రజల మధ్య ‘ముఅజ్జిన్’లు (మస్జిదులలో అజాన్ పలికేవారు) పొడవైన మెడలు కలిగి ఉంటారు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 387]
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నమాజు కొరకు పిలిచే ముజ్జిన్లు (అజాన్ పలికే వారు) పునరుత్థాన దినాన అతి పొడవైన మెడలను కలిగి ఉంటారు, ఇది వారు చేస్తున్న పని యొక్క గొప్పతనం, ఘనత, వారి మంచి పనుల సమృద్ధి మరియు వారి ప్రతిఫలం యొక్క గొప్పతనం కారణంగా.