عَنْ عَائِشَةَ رضي الله عنها قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الْمَاهِرُ بِالْقُرْآنِ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ، وَالَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَيَتَتَعْتَعُ فِيهِ، وَهُوَ عَلَيْهِ شَاقٌّ، لَهُ أَجْرَانِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 798]
المزيــد ...
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
“ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల సాంగత్యములో ఉంటాడు; మరియు ఎవరైతే ఖుర్ఆన్ ను తడబడుతూ, పారాయణం అతనికి కష్టంగా అనిపించినా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 798]
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఖుర్ఆన్ పఠనం చేసి, దానిని బాగా కంఠస్థం చేసి, దానిని పఠించడంలో ప్రావీణ్యత మరియు నైపుణ్యం సంపాదించిన వ్యక్తికి పరలోకంలో ప్రతిఫలం లభిస్తుంది, అతనికి గొప్ప హోదా లభిస్తుంది, మరియు అతడు సద్గుణవంతులైన దైవదూతలతో ఉంటాడు, అలాగే ఎవరైతే తన బలహీన ఙ్ఞాపక శక్తి కారణంగా ఖుర్ఆన్ ను సంకోచిస్తూ, తడబడుతూ, పఠిస్తాడో; అతనికి కష్టంగా ఉన్నప్పటికీ, దానిని పారాయణం చేస్తాడో, అతనికి రెండు బహుమతులు ఉన్నాయి. ఒకటి పారాయణం చేసినందుకు ప్రతిఫలం, రెండు దానిని పఠించడంలో అతని ప్రయత్నానికి, సంకోచానికి, తడబాటుకు ప్రతిఫలం.