ఉప కూర్పులు

హదీసుల జాబితా

“ఖుర్’ఆన్ పఠిస్తూ ఉండండి. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలున్నాయో ఆయన సాక్షిగా (చెబుతున్నాను), తమ (కాళ్ళ) కు కట్టివేసిన తాళ్ళ బంధనాల నుండి తప్పించుకునే ఒంటెల మాదిరిగా, ఖుర్’ఆన్ మీ జ్ఞాపకం (మెమొరీ) లో నుండి జారిపోతుంది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు బోధిస్తారో”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఖుర్’ఆన్ పఠించే విశ్వాసి యొక్క ఉపమానము దబ్బపండు వంటిది; దాని వాసనా మంచిగా ఉంటుంది మరియు రుచి కూడా మంచిగా ఉంటుంది. ఖుర్’ఆన్ పఠించని విశ్వాసి యొక్క ఉపమానము ఖర్జూరము వంటిది; దానికి వాసన ఉండదు, కానీ రుచి తీయగా ఉంటుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ