عن عثمان رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5027]
المزيــد ...
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు బోధిస్తారో”.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 5027]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: విశ్వాసులలో ఉత్తములు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానములు పొందు వారు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో (బోధిస్తారో) – అంటే, ఖుర్ఆన్ ను, దానిని పఠించే నియమాలను అనుసరించి పఠించడాన్ని, పఠించిన దానిని కంఠస్థము చేయడాన్ని, ఖుర్ఆన్ ను భావయుక్తంగా, మధురంగా పఠించడాన్ని, మరియు అందులోని ఆదేశాలను అవగాహన చేసుకోవడాన్ని, అలాగే దాని విశ్లేషణను నేర్చుకుంటాడో - అలాగే తాను నేర్చుకున్న ఖుర్ఆన్ శాస్త్రాలలో ఉన్న ఙ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తాడో, అలాగే ఆ ఙ్ఞానము ప్రకారము ఆచరిస్తూ ఉంటాడో – అటువంటి వాడు ఉత్తముడు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానమును పొందువాడు అవుతాడు.