عَنْ عَلِيٍّ رضي الله عنه قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«قُلِ اللهُمَّ اهْدِنِي وَسَدِّدْنِي، وَاذْكُرْ بِالْهُدَى هِدَايَتَكَ الطَّرِيقَ، وَالسَّدَادِ سَدَادَ السَّهْمِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2725]
المزيــد ...
అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు:
“(ఓ అలీ!) నీవు ఇలా పలుకు “అల్లాహుమ్మహ్’దినీ వసద్దిద్’నీ” (ఓ అల్లాహ్! నాకు మార్గదర్శకం ప్రసాదించు మరియు నేను తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి), ఈ దుఆ చేయునపుడు నీవు మార్గదర్శకం కొరకు ప్రార్థిస్తున్నపుడు ఆయన చేత నీవు సరళ మార్గములో మార్గదర్శకం చేయబడుతున్నావు అని మనసులో భావించు. అలాగే తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి అని ప్రార్థిస్తున్నపుడు, ఎక్కుపెట్టబడిన బాణము సూటిగా లక్ష్యం ఛేదించడాన్ని మనసులో ఊహించుకో.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2725]
అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వేడుకుంటూ దుఆ చేయమని ఆదేశించినారు: (అల్లాహుమ్మహ్’దినీ) ఓ అల్లాహ్! నాకు మార్గదర్శకం చేయి, నాకు మార్గనిర్దేశనం చేయి, నాకు సన్మార్గాన్ని చూపు; (వ సద్దిద్’నీ) నాకు (ఆ మార్గముపై) స్థిరత్వాన్ని ప్రసాదించు, అందులో నాకు సాఫల్యాన్ని ప్రసాదించు, మరియు నాకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో నేను సూటిగా ఉండేలా, సూటిగా వ్యవహరించేలా చేయి.
అల్-హుదా: (మార్గదర్శకం): అంటే ఒక వ్యక్తి సత్యమును వివరముగాను, మొత్తముగాను తెలుసుకొనుట, మరియు అతడు దానిని బాహ్యంగాను, అంతర్గతంగాను అనుసరించుటకు మార్గనిర్దేశం చేయబడుటను సూచిస్తుంది
అస్’సదాద్: (సరైన మార్గానికి కట్టుబడి ఉండుట): అంటే దీని అర్థము, సత్యానికి అనుగుణమైన దేనిలోనైనా అంటే మాటలలోనైనా, ఆచరణలలోనైనా మరియు విశ్వాసములలో అయినా – మార్గదర్శకాన్ని కలిగి ఉండుట, అన్ని విషయాలలోనూ, అన్ని వ్యవహారాలలోనూ సూటిగా ఉండుట, మరియు సూటియైన మార్గానికి కట్టుబడి ఉండుట.
స్పష్టమైన రూపంలో వ్యక్తీకరించబడినప్పుడు అంత వరకూ అస్పష్టంగా ఉన్న విషయాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి, ఈ దుఆను చదివేటప్పుడు గుర్తుంచుకోండి: (అల్-హుదా: మిమ్మల్ని సరైన మార్గం వైపు మార్గనిర్దేశం చేయమని అల్లాహ్’ను వేడుకుంటున్నారు). కనుక మార్గనిర్దేశం కొరకు వేడుకుంటున్నపుడు ఒక ప్రయాణీకునికి ఇవ్వబడే మార్గనిర్దేశాన్ని మీ హృదయంలో గుర్తుకు తెచ్చుకోండి. మార్గనిర్దేశంలో భాగంగా తనకు ఇవ్వబడిన ఆదేశాల నుండి అతడు పక్కకు జరుగడు, వైదొలగడు, తత్కారణంగా అతడు సురక్షితంగా, ఆలస్యం చేయకుండా తన గమ్యాన్ని చేరుకుంటాడు.
(వ అస్’సదాద్) అంటే సూటిగా ఎక్కు పెట్టబడిన బాణం: కొద్దిగా కూడా అటూ ఇటూ కాకుండా సూటిగా ఎక్కు పెట్టబడి వదిలిన బాణం ఎంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటుందో మనం గమనించవచ్చు. విలుకాడు బాణాన్ని వదలడానికి ముందు లక్ష్యాన్ని గురి చూస్తాడు. అదే విధంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను “అస్’సదాద్” (అన్ని విషయాలలో, అన్ని వ్యవహారాలలో సూటిగా ఉండేలా మార్గదర్శకం) కొరకు వేడుకుంటున్నపుడు, ఎక్కు పెట్టబడిన బాణం యొక్క ఋజుత్వాన్ని, సూటితత్వాన్ని కోరుకుంటున్న సంకల్పం మీలో ఉండాలి. అటువంటి సంకల్పం మీలో ఉంటే, మీరు అత్యున్నత స్థాయి ఋజుత్వం కొరకు, అత్యున్నత స్థాయి సూటితత్వం కొరకు, మరియు చరమస్థాయి మార్గదర్శకం కొరకు మీరు అర్థిస్తున్నారన్నమాట.
కనుక సర్వోన్నతుడైన అల్లాహ్ ను “అస్’సదాద్” కొరకు వేడుకొంటున్నపుడు ఈ భావాన్ని మీ మనసులోనికి తెచ్చుకుని, లక్ష్యం వైపునకు ఎక్కు పెట్టబడే బాణం మాదిరిగా అర్థించండి.