عن أبي موسى الأشعري رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «تعاهدوا هَذَا القُرْآنَ، فَوَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أشَدُّ تَفَلُّتاً مِنَ الإبلِ فِي عُقُلِهَا». .
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు కథనం’మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ ఖుర్ఆన్ పట్ల శ్రద్ద కలిగి ఉండండి ఎవరి చేతిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రాణం ఉందో ఆ ఉనికి సాక్షి ‘ఖుర్ఆన్ ఒంటె కంటే ఎక్కువగా తన కట్టు నుండి పారిపోతుంది’.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

"تعاهدوا القرآن" అర్ధం పవిత్ర ఖుర్ఆన్ పారాయణం క్రమంగా కంఠస్తము చేస్తూ ఉండండి,ఎల్లప్పుడు పారాయణం చేస్తూ ఉండండి,ప్రవక్త ప్రవచనం ప్రకారం :("فوالذي نفس محمد بيده لهو أشدّ تفلتاً")- ‘తఫల్లుతన్’ అర్ధం తొందరగా వెళ్లిపోవడం,తొందరగా మరవడం("من الإبل في عقلها") ఇది ఇఖాల్ కు ఏకవచనం,అర్ధం :ఒంటె ముందుకాళ్ళ మధ్యలో అది లేవకుండా కట్టబడేత్రాడు,హృదయంలో బద్రంగా ఉన్న ఖుర్ఆన్ ను దృఢంగా కట్టియున్నప్పటికి పారిపోయిన ఒంటెతో పోల్చబడింది,మహోన్నతుడైన అల్లాహ్ తన కారుణ్యం తో ఈ గొప్పవరాన్ని అనుగ్రహించాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి క్రమంగా పఠిస్తూ ఉండాలి,ప్రతీ రోజు కొంతభాగాన్ని నిర్దారించి మరిచిపోకుండా పారాయణం చేస్తూ ఉండాలి,ఒకవేళ స్వాభావికంగా ఎవరైనా మరిచిపోతే ఫర్వాలేదు,కానీ అల్లాహ్ అనుగ్రహించిన ఖుర్ఆన్ కంఠస్త వరాన్ని సోమరితనంతో వృధా చేస్తే మాత్రం అలాంటి వ్యక్తి కొరకు శిక్షలు కాచుకుని ఉన్నాయి,కాబట్టి మనము పవిత్ర ఖుర్ఆన్ ని మన హృదయాలనుండి తొలగిపోకుండా బద్రపరుచుకుంటూ క్రమం తప్పకుండా పటిస్తూ ఉండాలి,దాని ఆదేశాల ప్రకారం జీవిస్తూ ఉండాలి,ఎందుకంటే ఏదేని విషయం పై అమలు చేయడం అనేది దాన్ని గుర్తుంచుకోవడానికి మరియు బద్రపర్చడానికి కారణమవుతుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఖుర్ఆన్ పఠనం మరియు దాని అద్యాయనం క్రమం తప్పకుండా కొనసాగించమని ప్రోత్సహించబడుతుంది.
  2. నిశ్చయంగా ఖుర్ఆన్ హాఫిజ్ దాని పారాయణాన్ని క్రమం తప్పకుండా చదివినట్లైతే అది హృదయంలో సంరక్షించబడుతుంది,అలా చేయనట్లైతే అది హృదయం నుండి వెళ్లిపోతుంది మరియు మరవబడుతుంది,ఎందుకంటే అది ఒంటె కంటే కూడా ఎక్కువగా పారిపోతుంది.