عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنهُ قَالَ:
لَمَّا نَزَلَتْ: {إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُبِينًا لِيَغْفِرَ لَكَ اللهُ} إِلَى قَوْلِهِ {فَوْزًا عَظِيمًا} [الفتح: ١-٥] مَرْجِعَهُ مِنَ الْحُدَيْبِيَةِ، وَهُمْ يُخَالِطُهُمُ الْحُزْنُ وَالْكَآبَةُ، وَقَدْ نَحَرَ الْهَدْيَ بِالْحُدَيْبِيَةِ، فَقَالَ: «لَقَدْ أُنْزِلَتْ عَلَيَّ آيَةٌ هِيَ أَحَبُّ إِلَيَّ مِنَ الدُّنْيَا جَمِيعًا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1786]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
(మక్కా నగరానికి వెళ్ళడానికి అనుమతి నిరాకరించబడి) వెంట తీసుకు వెళ్ళిన బలి పశువులను హుదైబియాలోనే వధించి, తిరుగు ప్రయాణంలో సహచరులందరూ దుఃఖం మరియు బాధలో మునిగిపోయినప్పుడు, రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ ఆయతు అవతరించినది {ఇన్నా ఫతహ్నా లక ఫత్’హన్ ముబీనా లియఘ్ఫిర లకల్లాహు... (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము; నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి} నుండి మొదలుకుని ఆయన వాక్కు {…ఫౌజన్ అజీమా - ఇది ఒకగొప్ప విజయం.} వరకు [సూరహ్ అల్ ఫత్’హ్ 48:1-5]. ఆ సమయములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా అన్నారు: “నిశ్చయంగా నాపై, ఈ మొత్తం ప్రపంచం కంటే నాకు అత్యంత ప్రియమైన ఒక ఆయతు అవతరించింది”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1786]
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ ఆయతులు అవతరించినపుడు: {ఇన్నాఫతహ్నా లక ఫత్’హన్ ముబీనా(1) లియఘ్ఫిరలకల్లాహు మా తఖద్దమ మిన్ జంబిక వమా తఅక్ఖర, వయుతిమ్మ ని’మతహు అలైక సిరాతమ్ముస్తఖీమా(2) వయన్సురకల్లాహు నస్రన్ అజీజా(3) హువల్లజీ అన్’జలస్సకీనత ఫీ ఖులూబిల్ ము’మినీన లియజ్’దాదూ ఈమానన్ మఅ ఈమానిహిమ్, వలిల్లాహి జునూదస్సమావాతి వల్ అర్ది వకానల్లాహు అలీమన్ హకీమా(4) లియుద్’ఖిలల్ ము’మినీన వల్ ము’మినాతి జన్నాతి తజ్’రీ మిన్ తహ్’తిహల్ అన్’హారు ఖాలిదీన ఫీహా వయుకఫ్ఫిర అన్’హుమ్ సయ్యిఆతిహిమ్ వకాన జాలిక ఇందల్లాహి ఫౌజన్ అజీమా(5)} { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము(1) నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయటానికి మరియు నీకు ఋజు-మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి;(2) మరియు అల్లాహ్! నీకు గొప్ప సహకారంతో సహాయపడటానికి(3) ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని, భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.(4) విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు వారి పాపాలను తొలగించేందుకూను. మరియు అల్లాహ్ దృష్టిలో ఇది ఒకగొప్ప విజయం.(5)} [సూరహ్ అల్ ఫత్’హ్ 48:1-5] ఈ ఆయతులు అవరించినపుడు, సహబాలు (మక్కా ఖురైషీయుల చేత) ఉమ్రా చేయకుండా నిరోధించబడి, అల్ హుదైబియా వద్దనే తాము వెంట తీసుకు వెళ్ళిన బలిపశువులను అక్కడే వధించి, దుఃఖము మరియు నిరాశతో తిరుగు ప్రయాణమయ్యారు. అల్ హుదైబియా వద్ద ఖురైషీయులతో చేసుకున్న శాంతి ఒప్పందం ముస్లిముల ప్రయోజనాలకు మంచిది కాదు అని వారి (సహబాల) నమ్మకం. అటువంటి సమయాన ఈ ఆయతులు అవరించినవి. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఈ మొత్తం ప్రపంచం కంటే కూడా ప్రియమైన ఆయతు నాపై అవతరించినది” ఇలా అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఆయతును పఠించినారు.