عَنْ أُمِّ سَلَمَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها أَنَّهَا قَالَتْ: سَمِعْتُ رَسُولَ اللهِ صلى الله عليه وسلم يَقُولُ:
«مَا مِنْ مُسْلِمٍ تُصِيبُهُ مُصِيبَةٌ فَيَقُولُ مَا أَمَرَهُ اللهُ: {إِنَّا لِلهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ} [البقرة: 156]، اللَّهُمَّ أْجُرْنِي فِي مُصِيبَتِي، وَأَخْلِفْ لِي خَيْرًا مِنْهَا، إِلَّا أَخْلَفَ اللهُ لَهُ خَيْرًا مِنْهَا»، قَالَتْ: فَلَمَّا مَاتَ أَبُو سَلَمَةَ قُلْتُ: أَيُّ الْمُسْلِمِينَ خَيْرٌ مِنْ أَبِي سَلَمَةَ؟ أَوَّلُ بَيْتٍ هَاجَرَ إِلَى رَسُولِ اللهِ صلى الله عليه وسلم، ثُمَّ إِنِّي قُلْتُهَا، فَأَخْلَفَ اللهُ لِي رَسُولَ اللهِ صلى الله عليه وسلم.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 918]
المزيــد ...
ఉమ్మె సలమహ్, ఉమ్ముల్ మూ’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి), (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:
“ఏ ముస్లిమునకైనా ఏదైనా ఆపద సంభవిస్తే అతడు అల్లాహ్ ఆదేశించిన విధంగా: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156) అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ, వ అఖ్లిఫ్’లీ ఖైరమ్మిన్’హా” {నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము; ఓ అల్లాహ్, నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, మరియు (నేను నష్టపోయిన) దాని స్థానంలో నాకు అంతకంటే మంచిదానిని ప్రసాదించు} అని పలికినట్లైతే, అల్లాహ్ అతనికి దాని స్థానంలో మెరుగైనది ఇస్తాడు తప్ప మరేమీ కాదు.” ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా అన్నారు: “(నా భర్త) అబూ సలమహ్ చనిపోయినపుడు “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు వలస వెళ్ళిన ప్రాంతానికి మొట్టమొదట తన కుటుంబంతో సహా వలస వెళ్ళిన వారు అబూ సలమహ్; ఆయనకంటే ఉత్తములు ఎవరుంటారు?” అనుకుని ఈ దుఆ పఠించాను. ఆయన స్థానములో అల్లాహ్ నాకు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రసాదించినాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 918]
ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ (రదియల్లాహు అన్హా), రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా విన్నాను అని అన్నారు: ఏదైనా ఆపద లేక కీడు వచ్చిపడిన ఎవరైనా ముస్లిం, అల్లాహ్ సిఫార్సు చేసిన విధంగా ఇలా అంటాడో: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156 - నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము); (అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ) ఓ అల్లాహ్! నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, నేను సహనం వహించినందుకు గాను; మరియు నాకు కలిగిన ఈ నష్టాన్ని (వ అఖ్’లిఫ్ లీ) పూరించు, (ఖైరమ్’మిన్హా) దాని స్థానములో దానికంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించడం ద్వారా. (ఎవరైతే ఇలా వేడుకుంటారో) అల్లాహ్ అతనికి దానికంటే ఉత్తమమైనది ప్రసాదిస్తాడు తప్ప మరేమీ కాదు. ఆమె ఇంకా ఇలా అన్నారు: “(నా భర్త) అబూ సలమహ్ చనిపోయినపుడు “అబూ సలమహ్ కంటే ఉత్తముడు ఎవరుంటారు; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వలస వెళ్ళిన దగ్గరికి, అబూ సలమహ్ తన కుటుంబముతో సహా వలస వెళ్ళినవాడు – అనుకున్నాను. కానీ అల్లాహ్ సహాయంతో నేను ఆ పలుకులు పలికినాను. అబూ సలమహ్ స్థానములో అల్లాహ్ నాకు అతనికంటే ఉత్తముడైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రసాదించినాడు.”