عَنْ أَبِي الْجَعْدِ الضَّمْرِيِّ رَضيَ اللهُ عنهُ، وَكَانَتْ لَهُ صُحْبَةٌ، أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ تَرَكَ ثَلَاثَ جُمَعٍ تَهَاوُنًا بِهَا طَبَعَ اللَّهُ عَلَى قَلْبِهِ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 1052]
المزيــد ...
అబీ అల్ జ’ది అద్’దారిమీ (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సాహచర్యములో గడిపినారు. ఆయన ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
"ఎవరైతే నిర్లక్ష్యం కారణంగా మూడు శుక్రవారాలను వదిలివేస్తారో, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు"
[దృఢమైనది] - - [سنن أبي داود - 1052]
శుక్రవారం ప్రార్థనను వదిలివేయవద్దని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానికి వ్యతిరేకంగా హెచ్చరించినారు; సరైన కారణం లేకుండా సోమరితనం మరియు నిర్లక్ష్యం కారణంగా మూడు సార్లు శుక్రవారం నమాజును వదిలివేస్తే, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు, దానిని మూసివేస్తాడు మరియు మంచి చేరకుండా అడ్డుకుంటాడు.