عَنْ أَبِي عَبْدِ اللَّهِ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ الْأَنْصَارِيِّ رَضِيَ اللَّهُ عَنْهُمَا:
أَنَّ رَجُلًا سَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَرَأَيْتَ إِذَا صَلَّيْتُ المَكْتُوبَاتِ، وَصُمْتُ رَمَضَانَ، وَأَحْلَلْتُ الحَلَالَ، وَحَرَّمْتُ الحَرَامَ، وَلَمْ أَزِدْ عَلَى ذَلِكَ شَيْئًا، أَأَدْخُلُ الجَنَّةَ؟ قَالَ: «نَعَمْ».
[صحيح] - [رواه مسلم] - [الأربعون النووية: 22]
المزيــد ...
అబూ అబ్దుల్లాహ్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగినాడు: "మీరు ఏమంటారు? నేను తప్పనిసరి ఫర్ద్ నమాజులను చేస్తూ, రమజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ, ధర్మబద్ధమైన దానిని ధర్మబద్ధంగా భావిస్తూ, మరియు నిషేధించబడిన దానిని నిషేధించబడినదిగా భావిస్తూ, నేను దానిపై ఏమీ అధికంగా చేయకుండా ఉంటే, నేను స్వర్గంలో ప్రవేశిస్తానా?" ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అవును."
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [الأربعون النووية - 22]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైనా కేవలం విధిగా ఆచరించవలసిన ఐదు పూటల నమాజులను మాత్రమే ఆచరిస్తాడో, వేరే స్వచ్ఛంద నమాజులు ఎక్కువగా ఆచరించడో, అలాగే విధిగా ఆచరించవలసిన రమదాన్ నెల ఉపవాసములను మాత్రమే ఆచరిస్తూ, ఇతర స్వచ్ఛంద ఉపవాసములను ఆచరించడో, హలాల్ విషయాలను హలాల్ విషయాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాటిని ఆచరిస్తూ, హరాం విషయాలను హరాం విషయాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాటికి దూరంగా ఉంటాడో, అతడు స్వర్గము లోని ప్రవేశిస్తాడు.